
పట్టాలెక్కనున్న డబ్లింగ్ పనులు!
పెరుగనున్న రద్దీ
బీబీనగర్ – నడికుడి రెండో లైన్ అందుబాటులోకి వస్తే తెలుగు రాష్ట్రాల మధ్య రద్దీ పెరగనుంది. తిరుపతి, చైన్నె, ఖమ్మం తదితర ప్రాంతాలకు బీబీనగర్–నడికుడి–గుంటూరు మార్గం దగ్గరగా ఉండటం, డబ్లింగ్‌తో రైళ్ల వేగం పెరగనుండడంతో ప్రయాణికుల రద్దీ పెరిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు బీబీనగర్ – నడికుడి మార్గం సింగిల్ ట్రాక్ లేన్ కావడంతో ఒక రైలు వస్తే మరో రైలును ముందు స్టేషన్‌లో నిలిపేవారు. రెండో లేన్ అందుబాటులోకి వస్తే రైలు నిలిపే అవసరం ఉండదు. ప్రయాణికులకు వేచి ఉండే ఇబ్బందులు తొలగనున్నాయి.
బీబీనగర్: బీబీనగర్ – నడికుడి డబ్లింగ్ పనులకు మోక్షం కలిగింది. రెండు తెలుగు రాష్ట్రాలకు అనుసంధానంగా ఉన్న సిక్రిందాబాద్ – నడికుడి – గుంటూరు రెండో లేన్ పనులకు రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భూ సేకరణకు సంబంధించి ఈనెల 3న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆగస్టులో పనులు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలో బీబీనగర్ మండలం గూడూరు నుంచి గుంటూరు జిల్లా నల్లపాడు వరకు డబ్లింగ్ పనులు జరుగనున్నాయి. ముందుగా నడికుడి మార్గంలో 48 కిలో మీటర్ల మేర రూ.647 కోట్ల అంచనాతో పనులు ప్రారంభించే అవకాశం ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో 900 ఎకరాలకు పైగా భూసేకరణకు రైల్వే శాఖ ఆదేశించినట్లు తెలిసింది. బీబీనగర్ మండల పరిధిలోని గూడూరులో 60 ఎకరాలు, భువనగిరి మండల పరిధిలోని నాగిరెడ్డిపల్లి, బొల్లేపల్లి, నందనం, అనాజిపురం, పగిడిపల్లి, భువనగిరిలో 830 ఎకరాలకు పైగా భూమి సేకరించనున్నారు.
239 కిలో మీటర్లు..
బీబీనగర్–నడికుడి మధ్య రెండో రైల్వే లైన్ పనులకు కేంద్ర కేబినెట్ వ్యవహారాల కమిటీ ఆమోదం తెలుపుతూ 2023లో దక్షిణ మధ్య రైల్వేకు లేఖ రాసింది. దీంతో 239 కిలో మీటర్లకు పైగా రెండో లైన్ నిర్మాణానికి రూ.2,853.23 కోట్లు కేటాయించింది. ఇందులో సివిల్ పనులకు రూ.1,947.44 కోట్లు, ఇంజనీరింగ్ నిర్మాణ పనులకు రూ.588.17కోట్లు, సిగ్నలింగ్ టెలికాం పనులకు రూ.319.62 కోట్లు అంచనా వ్యయంగా చూపారు. 2024 పిబ్రవరిలో టెండర్ల ప్రక్రియ ముగిసింది. తదుపరి కాంట్రాక్టర్ ఎంపిక, ఈసీసీ ఆమోదంతో ఒప్పందం జరగాల్సిన ప్రక్రియ కొనసాగుతోంది. ఆగస్టు నుంచి పనులు ప్రారంభంక ావచ్చని రైల్వే అధికారుల నుంచి సమాచారం.
బీబీనగర్ – నడికుడి రెండో లేన్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్
ఫ భూ సేకరణకు గెజిట్ నోటిఫికేషన్ జారీ
ఫ ఆగస్టు నుంచి పనులు
ప్రారంభమయ్యే అవకాశాలు
ఫ తొలుత నడికుడి మార్గంలో పనులు