
వ్యవసాయ భూములకు వ్యాపిస్తున్న మంటలు
నకిరేకల్: నకిరేకల్ మున్సిపాలిటీలో సేకరించిన చెత్తను తరలించేందుకు నోముల– నెల్లిబండ శివారులో ఎనిమిది ఎకరాల ప్రభుత్వ స్థలంలో డంపింగ్ యార్డు ఏర్పాటు చేశారు. ఈ డంపింగ్ యార్డుతో చుట్టుపక్కల పంట పొలాలు ఉన్న రైతులు ఆందోళన చెందుతున్నారు. చెత్తకు నిప్పు పెడుతుండటంతో వచ్చే పొగతో పంట పొలాలు దెబ్బతినడంతో పాటు, పశు గ్రాసం కాలిబూడిదవుతోందని రైతులు వాపోతున్నారు. వేసవిలో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించి చుట్టుపక్కల రైతులు వ్యవసాయ భూముల్లో ఉన్న పైప్‌లైన్ కాలిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి. డంపింగ్ యార్డు దారి వెంట ఉండటంతో నోముల, నెల్లిబండ గ్రామాల రైతులు తమ వ్యవసాయ భూముల వద్దకు వెళ్లాలంటే చెత్తకు పెడుతున్న నిప్పుతో వచ్చే పొగ వల్ల ఇబ్బందులు పడుతున్నారు.