
మొక్కుబడిగా చెత్తసేకరణ
హాలియా : హాలియా మున్సిపాలిటీలో రోజుకు 8 టన్నుల చెత్త వెలువడుతోంది. 50 మంది కార్మికులు, 2 ట్రాక్టర్లు, 5 ఆటోల ద్వారా సేకరించి ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో ఉన్న డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. తడి, పొడి చెత్త కలపడంతో పాటు చికెన్, మటన్ మార్కెట్ ప్రాంతాల నుంచి వచ్చే వ్యర్థాలనూ డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. ఈ యార్డుకు సమీపంలో ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాల, కేజీబీవీ పాఠశాల ఉండడంతో పేరుకుపోయిన వ్యర్థాలతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి ఇంటి నుంచి తడి, పొడి చెత్త తీసుకెళ్తున్నారే తప్పా.. ప్రాసెసింగ్ చేసి మున్సిపాలిటీ అభివృద్ధికి ఆదాయం సమకూర్చేందుకు అధికారులు చొరవ తీసుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి.