
విద్యుత్ స్టోర్ తనిఖీ
నల్లగొండ: నల్లగొండలోని విద్యుత్ స్టోర్‌ను టీజీఎస్‌పీడీసీఎల్ డైరెక్టర్ నరసింహులు గురువారం తనిఖీ చేశారు. వ్యవసాయ కనెక్షన్లకు సంబంధించి నిబంధనలు పాటించకుండా డబ్బులు ఇచ్చిన వారికే ట్రాన్స్‌ఫార్మర్లు ఇస్తున్నారని ఆరోపణలు రావడం, మిర్యాలగూడ నియోజకవర్గంలో వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్లు ఇవ్వకుండా పెండింగ్‌లో ఉంచడంపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీంతో సీఎండీ ఆదేశాల మేరకు డైరెక్టర్ నర్సింహులుతోపాటు సీజీఎం రూరల్ బాలస్వామి నల్లగొండలోని విద్యుత్ స్టోర్‌ను తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. అనంతరం ఏఈ, ఏడీలతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మిర్యాలగూడలో ఏఈలతో వ్యవసాయ కనెక్షన్ల పెండింగ్‌పై సమీక్షించారు. డైరెక్టర్ ఆదేశాల మేరకు వెంటనే 59 ట్రాన్స్‌ఫార్మర్లు, 10 కిలోమీటర్ల మేర కండక్టర్ వైర్ మంజూరు చేశారు.
ఫ నల్లగొండ, మిర్యాలగూడ ఏఈలతో టీజీఎస్‌పీడీసీఎల్ డైరెక్టర్ సమీక్ష
ఫ మిర్యాలగూడకు 59 ట్రాన్స్‌ఫార్మర్లు,
కండక్టర్ వైర్ మంజూరు