వైభవంగా వేంకటేశ్వరస్వామి కల్యాణం
కల్యాణాన్ని తిలకిస్తున్న భక్తులు
ఏటూరునాగారం: మండల కేంద్రంలోని సీతారామచంద్రస్వామి ఆలయంలో గీతా జయంతిని పురస్కరించుకుని సోమవారం శ్రీ వేంకటేశ్వర స్వామి, అలివేలు మంగా, పద్మావతి అమ్మవారి కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. కమిటీ సభ్యులు, అర్చకులు ఎల్లాప్రగడ నాగేశ్వరరావు శర్మ, మణికంటశర్మ, హయగ్రీవచారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కల్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి వీక్షించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో రామాలయం చైర్మన్ అలువాల శ్రీనివాస్, కత్తెర శ్రీనివాస్, తాడూరి దీనబంధావస్వామి, బాల్యం ప్రసాద్, చెన్న రాంబాబు, శ్రీనివాస్, రాహుల్, సిసింద్రి, ఎగ్గడి జగదీశ్, చిప్ప అశోక్, సర్వేశం, గుంత రమేష్, నూక ప్రభాకర్, గంజి రమేష్ అయ్యప్పస్వామి దేవాలయం చైర్మన్ బోలుసాని గౌరీ శంకర్, సాయిబాబా దేవాలయం చైర్మన్ పెండ్యాల ప్రభాకర్, అయ్యప్ప గురు స్వాములు వసంత రమేష్, సిద్ధూ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఉత్సవ విగ్రహాలను ప్రత్యేక రథంలో ఊరేగించారు. భక్తి పాటలతో సేవకులు నృత్యాలు చేశారు. భక్తులు రథానికి ఎదురువచ్చి నీళ్లు ఆరబోసి కొబ్బరికాయలను కొట్టారు.
వైభవంగా వేంకటేశ్వరస్వామి కల్యాణం


