నిబంధనలు అతిక్రమించిన నాయకులు
ములుగు రూరల్: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ నిబంధనలను కాంగ్రెస్ పార్టీ నాయకులు అతిక్రమించారు. ఈ మేరకు సోమవారం మల్లంపల్లి మండల పరిధిలోని మహ్మద్‌గౌస్‌పల్లిలో రెండో రోజు సర్పంచ్‌గా నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చిన కాంగ్రెస్ నాయకులు నిబంధనలు పట్టించుకోలేదు. నామినేషన్ వేసే అభ్యర్థితో పాటు మరొకరు మాత్రమే లోపలికి వెళ్లే అవకాశం ఉంది. నామినేషన్ వేసేందుకు డీజే, డప్పులతో వచ్చారు. అలాగే నామినేషన్ సమర్పించేందుకు నాయకులు గుంపుగా వెళ్లడాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, కాంగ్రెస్ నాయకులకు వాగ్వాదం చోటుచేసుకుంది. నిబంధనలు అతిక్రమించడమే కాక పోలీసులపై దురుసుగా ప్రవర్తించడాన్ని కాంగ్రెస్ నాయకులను పలువురు తప్పుపట్టారు.
పోలీసులు, కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం


