భారీ క్రేన్లు.. రాతి పిల్లర్లు
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారానికి భారీ క్రేన్లు.. రాతి పిల్లర్లను మంగళవారం ప్రత్యేక వాహనాల్లో తీసుకొచ్చారు. గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణంలో భాగంగా గద్దెల చుట్టూ సాలహారం స్టోన్స్ నిర్మాణం పనులు సాగుతున్నాయి. అదే విధంగా ప్రధాన ఆర్చీ ద్వారాలకు సంబంధించిన భారీ రాతి పిల్లర్లను మేడారానికి తీసుకొచ్చారు. వాటిని కిందకు దింపేందుకు భారీ క్రేన్లు మేడారానికి వచ్చి వాటిని కిందకు దింపాయి. ఈ సందర్భంగా భారీ క్రేన్లను భక్తులు, స్థానికులు ఆసక్తిగా తిలకించారు.
మేడారంలో భారీ క్రేన్లు


