పార్టీ బలోపేతానికి కృషి
గోవిందరావుపేట: జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తానని టీపీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ అన్నారు. ఈ మేరకు ఆయన హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో టీసీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్ నుంచి రెండోసారి డీసీసీ అధ్యక్షుడిగా నియామక పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకంతో మరోసారి నమ్మకం ఉంచి డీసీసీ అధ్యక్షుడిగా నియమించిన ఏఐసీసీ నేతలు, సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, మంత్రి సీతక్కలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. పార్టీ అభ్యున్నతికి పాటుపడిన వారికి పార్టీ తగిన గుర్తింపు ఇస్తుందని తెలిపారు. రెండోసారి అశోక్ డీసీసీ అధ్యక్ష పీఠం దక్కడంతో కాంగ్రెస్ కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది.
డీసీసీ అధ్యక్షుడిగా రెండోసారి నియామక
పత్రం అందుకున్న పైడాకుల అశోక్


