అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి
● కలెక్టర్ టీఎస్.దివాకర
ములుగు/ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం మాస్టర్‌ప్లాన్ ప్రకారం అభివృద్ధి పనుల్లో వేగం పెంచి సకాలంలో పనులన్నీ పూర్తి చేయాలని కలెక్టర్ టీఎస్.దివాకర అధికారులను ఆదేశించారు. ఈ మేరకు కలెక్టర్ తాడ్వాయి మండల పరిధిలోని మేడారంలో ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, డీఎఫ్‌ఓ రాహుల్ కిషన్‌తో కలిసి జాతర పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గద్దెల ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్న రాతి నిర్మాణంలో పొరపాట్లు జరగకుండా చూడాలని అధికారులను అదేశించారు. నూతనంగా ఏర్పాటు చేస్తున్న క్యూలైన్ రేలింగ్ పనులను, ఊరట్టం స్తూపం వద్ద సర్కిల్ సుందరీకరణ పనులు పరిశీలించి త్వరగా పూర్తి చేయాలన్నారు. ఆయన వెంట డీఎస్పీ రవీందర్, అధికారులు ఉన్నారు.
విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంచాలి
విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించాలని కలెక్టర్ టీఎస్.దివాకర అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో ఏస్క్వేర్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో జిల్లా పరిధిలోని 40 ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు కెరీర్ గైడెన్స్‌పై ఓరిఝెంటేషన్ నిర్వహించారు. ముందుగా మై సెల్ఫ్ ఈ వెంట్ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులకు కెరీర్ ఎంపికలో స్పష్టత, దిశానిర్దేశం ముఖ్యమన్నారు. విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ తరగతులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అనంతరం కీస్టోన్ పాఠశాల ఫౌండర్ శ్రీ లక్ష్మీ మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను ఉపాధ్యాయులు గుర్తించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీపడేలా ప్రోత్సహించాలని సూచించారు. చదువులో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు డిగ్రీ పూర్తి అయ్యేవరకు స్కాలర్‌షిప్ అందిస్తామని వివరించారు.


