నేడు డయల్ యువర్ డీఎం
ములుగు రూరల్: నేటి డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ వరంగల్–2 డిపో మేనేజర్ రవిచందర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. నేడు బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటిగంట వరకు వరంగల్–2 డిపోలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ములుగు జిల్లా పరిధిలోని ప్రయాణికులు సెల్ నంబర్ 7382425150కు కాల్ చేసి తమ సమస్యలను తెలియజేయవచ్చని వివరించారు.
రోడ్డు పనులు
త్వరగా పూర్తి చేయాలి
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారంలో చేపట్టిన రోడ్డు విస్తరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ టీఎస్.దివాకర అధికారులను ఆదేశించారు. మహాజాతరకు 56 రోజులే కథనం సాక్షిలో మంగళవారం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన కలెక్టర్ మేడారంలో ఆర్‌అండ్‌బీశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన రోడ్ల విసర్తణ పనులను పరిశీలించారు. పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తి చేయాలని ఆర్‌అండ్‌బీ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
సైబర్ నేరాలపై అప్రమత్తం
ములుగు రూరల్: సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఓఎస్డీ శివం ఉపాధ్యాయ అన్నారు. ఈ మేరకు ఆయన జిల్లా కేంద్రంలోని పోలీస్ కాన్ఫరెన్స్ హాల్‌లో మంగళవారం రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో చేపట్టిన సైబర్ నేరాలపై అవగాహన సదస్సును మెడికల్ కళాశాల, గిరిజన యూనివర్సిటీ, ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు అవగాహన కల్పించారు. సైబర్ నేరాల అవగాహన వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యక్తిగత సమాచారం పాస్‌వర్డ్, బ్యాంక్ వివరాలు, ఓటీపీలు ఎవరితో పంచుకోకూడదని తెలిపారు. అపరిచిత లింకులు ఓపెన్ చేయవద్దని సూచించారు. డిజిటల్ అరెస్టు, బెదిరింపులకు భయపడకూదన్నారు. ప్రజలు సైబర్ మోసాల బారిన పడితే 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు, క్రైమ్ పోలీసులకు లేదా సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సైబర్ క్రైమ్ డీఎస్పీ నందిరాం, సీఐ సురేశ్, గిరిజన యూనివర్సిటీ రిజిస్టర్ రఘురాం, మెడికల్ కళాశాల ఫ్యాకల్టీ జీవన చంద్ర, క్రైమ్ సిబ్బంది శ్రీకాంత్, శ్వేత తదితరులు పాల్గొన్నారు.
నేడు డయల్ యువర్ డీఎం
నేడు డయల్ యువర్ డీఎం


