బుచ్చిబాబుకు బెంజి కారు, గురువుతో షికారు

Uppena Director Buchibabu Sana Gets Benz GLC Car - Sakshi

తొలి సినిమాతోనే తెలుగు ఇండస్ట్రీకి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందించాడు బుచ్చిబాబు. భారీ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న ఈ డైరెక్టర్‌ టాలీవుడ్‌కు వైష్ణవ్‌ తేజ్‌, కృతీ శెట్టిలను హీరోహీరోయిన్లుగా పరిచయం చేశాడు. ఇక ఈ సినిమా వంద కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించి అఖండ విజయాన్ని నమోదు చేసుకోవడంతో ఉప్పెన నిర్మాణ సంస్థ మైత్రీమూవీ మేకర్స్‌ హీరోహీరోయిన్లకు భారీ ఎమౌంట్‌ గిఫ్ట్‌గా ఇచ్చిన విషయం తెలిసిందే. హీరో వైష్ణవ్‌ తేజ్‌కు కోటి రూపాయలు, హీరోయిన్‌ కృతీ శెట్టికి రూ.25 లక్షలు ఇచ్చినట్లు సమాచారం.

దర్శకుడు బుచ్చిబాబుకు కారు లేదా ఇల్లును ఆఫర్‌ చేయగా ఆయన కారు తీసుకునేందుకు ఆసక్తి చూపారట. దీంతో తాజాగా మైత్రీ మూవీ మేకర్స్‌ బుచ్చిబాబుకు బెంజి జీఎల్‌సీ కారును బహుమతిగా ఇచ్చారు. దీని విలువ సుమారు రూ.75 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక కారు తన చేతికి రాగానే తన గురువు సుకుమార్‌ను ఎక్కించుకుని హైదరాబాద్‌ రోడ్ల మీద చక్కర్లు కొట్టాడు బుచ్చి బాబు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇదిలా వుంటే ఆయన తర్వాతి సినిమా కూడా ఇదే బ్యానర్‌లోనే చేయనున్నాడు.

చదవండి: ఉప్పెన విజయం: వైష్ణవ్‌, ‘బేబమ్మ’కు భారీ గిఫ్ట్‌

నన్ను పెళ్లి చేసుకుంటావా?: విజయ్‌ సేతుపతి

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top