ఈ వారం సినీ ప్రియులను అలరించే చిత్రాలు,వెబ్‌ సిరీస్‌లు తెలుసా ?

Upcoming Movies And Web Series On This Week - Sakshi

Upcoming Movies And Web Series On This Week: సినీ ప్రియులకు సినిమాలు చూడటమే ఆనందం. అందుకే ఎప్పుడెప్పుడూ ఏ కొత్త సినిమా విడుదలవుతుంది ? ఏ వెబ్‌ సిరీస్‌ చూద‍్దాం ? అంటూ ఆలోచిస్తూ ఉంటారు. ఈ ఆలోచనలకు చెక్ పెడుతూ ఈ వారం థియేటర్లు, ఓటీటీలు కళకళలాడనున్నాయి. ప్రేక్షకులను అలరించేందుకు ఈ వారం థియేటర్‌తో పాటు ఓటీటీలో రానున్న పలు హిందీ, తెలుగు ఆసక్తికర చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ల గురించి తెలుసుకుందామా !

1. అంతిమ్‌ 

బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ నటిస్తున్న చిత్రం 'అంతిమ్‌: ది ఫైనల్ ట్రూత్'. మహేశ్‌ వి. మంజ్రేకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఆయుష్‌ శర్మ కీలకపాత్ర పోషించారు. ప్రొడక్షన్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్‌ 26న థియేటర్లలో సందడి చేయనుంది. ఇందులో సల్మాన్‌ ఖాన్‌ పోలీసు ఆఫిసర్‌గా కనిపించనున్నారు. ఈ సినిమా షూటింగ్‌ కేవలం 60 రోజుల్లోనే పూర్తి చేశారు.  

 

2. అనుభవించు రాజా 

రాజ్‌తరుణ్‌ కీలక పాత్రలో శ్రీను గావిరెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘అనుభవించు రాజా’. ఉభయ గోదావరి జిల్లాల నేపథ్యంలో సాగే ఓ యూత్‌ఫుల్‌ లవ్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందింది. కషికా ఖాన్‌ కథానాయికగా చేసిన ఈ సినిమా టీజర్‌, ట్రైలర్‌లు అందులోని సంభాషణలు ఆకట్టుకున్నాయి. నవంబర్‌ 26న థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్‌, శ్రీ వేంకటేశ్వర సినిమాస్‌ సంయుక్తంగా నిర్మించాయి. 

3. ది లూప్‌

తమిళంతో పాటు, తెలుగులోనూ గుర్తింపు ఉన్న నటుడు శింబు. ఈ తమిళ స్టార్‌హీరో ఇప్పుడు పాన్‌ ఇండియా చిత్రంతో అలరించేందుకు 'ది లూప్‌' సినిమాతో రానున్నారు. క్రియేటివ్‌ డైరెక్టర్‌ వెంకట్‌ప్రభు దర్శకత్వంలో శింబు నటించిన తమిళ చిత్రం ‘మానాడు’. దీన్ని తెలుగులో ‘ది లూప్‌’ పేరుతో నవంబరు 25న థియేటర్‌లలో విడుదల చేస్తున్నారు. పొలిటికల్ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కించినట్లు సమాచారం. 

4. ఆశ ఎన్‌కౌంటర్‌

యావత్ రాష్ట్రాన్ని ఉలిక్కిపడేలా చేసిన హైదరాబాద్‌ గ్యాంగ్‌రేప్‌ను ఆధారంగా చేసుకుని వస్తోన్న సినిమా 'ఆశ ఎన్‌కౌంటర్‌'.  2019 నవంబర్‌ 26న హైదరాబాద్‌ నగరశివారులోని చటాన్‌పల్లి వద్ద ఓ యువతిపై కొందరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడి.. అనంతరం ఆమెను హత్య చేశారు. ఇదే కథను నేపథ్యంగా చేసుకుని ఆనంద్‌ చంద్ర ఈ సినిమాను తెరకెక్కించారు. నవంబర్‌ 26న థియేటర్లలో రిలీజ్‌ కానుంది.  ఈ సినిమాను ఆర్జీవీ సమర్పిస్తున్నారు. 

5. క్యాలీఫ్లవర్‌

సంపూర్ణేష్‌ బాబు హీరోగా ఆర్కే మలినేని దర్శకత్వం వహించిన వినోదాత్మక చిత్రం ‘క్యాలీప్లవర్‌’. దీనికి 'శీలో రక్షతి రక్షితః' అన్నది క్యాప్షన్‌. కథానాయికగా వాసంతి నటించగా, పోసాని కృష్ణమురళి, పృథ్వీ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం నవంబరు 26న థియేటర్లలో రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. 

6. భగత్‌ సింగ్‌ నగర్‌

భగత్‌ సింగ్‌ రాసిన ఓ లైన్‌ను ఆదర్శంగా తీసుకొని సమాజంలో ప్రస్తుతం జరుగుతున్న సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'భగత్‌ సింగ్‌ నగర్ వాలాజా క్రాంతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో విదార్థ్, ధృవీక జంటగా నటించనున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందుతున్న ఈ చిత్రాన్ని వాలాజా గౌరి, రమేష్‌ ఉడత్తు సంయుక్తంగా నిర్మించారు. నవంబర్‌ 26న థియేటర్లలో విడుదల కానుంది. 

7. కార్పొరేటర్‌

కమెడియన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు షకలక శంకర్. అంతేకాదు, ఆయన కథానాయడిగానూ నటించారు. తాజాగా ఆయన కీలక పాత్రలో సంజయ్‌ పునూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కార్పొరేటర్‌’. సునీత పాండే, లావణ్య శర్మ, కస్తూరి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా నవంబరు 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. వినోదంతో పాటు, రాజకీయ సందేశంతో కూడిన చిత్రంగా ‘కార్పొరేటర్‌’ రూపొందించారు. 

8. 1997

డా.మోహన్, నవీన్ చంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, సంగీత దర్శకుడు కోటి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘1997’. డా.మోహన్ స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాచరు. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ‘1997’ను నవంబరు 26న థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈశ్వర్ పార్వతి మూవీస్ పతాకంపై మీనాక్షి రమావత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. 

ఓటీటీలో సందడి చేసే చిత్రాలు..

అమెజాన్ ప్రైమ్‌ వీడియో

*  దృశ్యం-2, నవంబర్‌ 25
* చ్చోరీ (హిందీ), నవంబరు 26

నెట్‌ఫ్లిక్స్‌

* పెద్దన్న
* ట్రూ స్టోరీ (హాలీవుడ్‌), నవంబరు 24
* బ్రూయిజ్‌డ్‌ (హాలీవుడ్‌), నవంబరు 24
* ఏ కాజిల్‌ ఫర్‌ క్రిస్మస్‌ (హాలీవుడ్‌), నవంబరు 26

డిస్నీ+ హాట్‌స్టార్‌

* 2024(హిందీ), నవంబరు 23

* హాకేయ్‌ (తెలుగు డబ్బింగ్‌), నవంబరు 24

* దిల్‌ బెకరార్‌ (వెబ్‌ సిరీస్‌), నవంబరు 26

జీ5

 * రిపబ్లిక్‌, నవంబర్ 26

ఆహా

* రొమాంటిక్‌, నవంబర్‌ 26
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top