Upcoming Movies And Web Series: ఈ వారం అలరించే చిత్రాలు, వెబ్‌ సిరీస్‌లు..

Upcoming Movies And Web Series In December Second Week - Sakshi

Upcoming Movies And Web Series In December Second Week: నందమూరి బాలకృష్ణ నటించిన 'అఖండ' చిత్రం విజయంతో టాలీవుడ్‌ బాక్సాఫీస్‌ వద్ద సందడి మొదలైంది. ఇక‍్కడి నుంచి సంక్రాంతి వరకు వరుస సినిమాలు అలరించనున్నాయి. అంతకుముందు దీపావళి కానుకగా వచ్చిన బాలీవుడ్‌ మూవీ 'సూర్యవంశీ' మంచి వసూళ్లు రాబట్టింది. ఈ క్రమంలో డిసెంబర్‌ రెండో వారంలో థియేటర్లు, ఓటీటీల్లో విడుదలయ్యే సినిమాలేంటో చూద్దాం. 

1. లక్ష్య

యంగ్ హీరో నాగశౌర్య నటించిన క్రీడా నేపథ్య చిత్రం ‘లక్ష్య’. నారాయణ్‌ దాస్‌ కే నారంగ్‌, పుస్కర్‌ రామ్‌ మోహన్‌రావు, శరత్‌ మరార్‌ సంయుక్తంగా నిర్మించగా సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వం వహించారు. జగపతి బాబు, సచిన్‌ ఖేద్కర్‌ కీలక పాత్రలు పోషించగా కేతిక శర్మ హీరోయిన్‌. ఈ సినిమా డిసెంబర్‌ 10న థియేటర్లలో సందడి చేయనుంది. విలువిద్య నేపథ్య కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది. ఈ సినిమా కోసం విలు విద్యలో ప్రత్యేక శిక్షణ తీసుకోవడంతో పాటు తన శరీరాకృతిని పూర్తిగా మార్చుకున్నాడు నాగశౌర్య. కాల భైరవ స్వరాలు సమకూరుస్తున్నారు.

2. గమనం

శ్రియ ప్రధాన పాత్రలో నటించిన పాన్‌ ఇండియా చిత్రం ‘గమనం’. ఈ చిత్రాన్ని సుజనారావు తెరకెక్కించారు. రమేష్‌ కురుటూరి, వెంకీ పుష్పదపు, జ్ఞానశేఖర్‌ వి.ఎస్‌ సంయుక్తంగా నిర్మించారు. శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్‌, నిత్యా మేనన్‌ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్‌ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇళయరాజా స్వరాలు సమకూర్చారు. భావోద్వేగభరితమైన మూడు కథలతో రూపొందిన చిత్రమిది. ఇందులో శ్రియ దివ్యాంగురాలి పాత్రలో కనిపించనుంది.

3. నయీం డైరీస్‌

పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన గ్యాంగ్‌స్టర్‌ నయీం జీవిత కథతో తెరకెక్కిన ‘నయీం డైరీస్‌’ ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకొస్తోంది. దాము బాలాజీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వశిష్ఠ సింహ ప్రధాన పాత్ర పోషించారు. సీఏ వరదరాజు నిర్మాత. 'రాజకీయ, పోలీస్‌ వ్యవస్థలు నయీం అనే అసాంఘిక శక్తిని తమ ప్రయోజనాల కోసం ఎలా ఉపయోగించుకున్నాయనే విషయాన్ని ధైర్యంగా ఈ సినిమాలో చెబుతున్నాం. నయీం ఎన్‌కౌంటర్‌ అయ్యాక అతని గురించి పూర్తిగా అధ్యయనం చేశా. నయీం సాగించిన అసాంఘిక కార్యక్రమాలు, అతని డైరీలో పేర్కొన్న విషయాలు ఎలాంటివనేది తెరపైనే చూడాలి. వశిష్ఠ సింహ నటన చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.' అని చిత్ర బృందం చెబుతోంది.

4. మడ్డీ

డిసెంబర్‌ 10న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న పాన్ ఇండియా చిత్రం 'మడ్డీ'. ఈ సినిమాలో యువన్‌, రిధాన్‌ కృష్ణ, అనూష సురేష్‌, అమిత్‌ శివదాస్‌ నాయర్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రేమ కృష్ణదాస్‌ నిర్మాణంలో ప్రగభల్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను తెలుగులో ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు విడుదల చేయనున్నట‍్లు చిత్రబృందం తెలిపింది. 'మడ్‌ రేసింగ్‌ నేపథ్యంలో సాగే చిత్రమిది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఉంటుంది. ఐదేళ్లు పరిశోధన చేసి దర్శకుడు ఈ స్క్రిప్ట్‌ సిద్ధం చేశారు. ఇందులో ఫ్యామిలీ డ్రామా, వినోదం, సాహసం.. ఇలా ప్రతి ఎమోషన్‌ ఉంటుంది. ఈ సినిమా కోసం ప్రధాన నటులకు రోడ్‌ రేసింగ్‌లో రెండేళ్లు శిక్షణ ఇచ్చారు.' అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సినిమాకి రవి బస్రూర్‌ స్వరాలందిస్తున్నారు.

ఇవే కాకుండా బుల్లెట్ సత్యం, ప్రియతమ, మనవూరి పాండవులు, కటారి కృష్ణ, సర్వం సిద్ధం చిత్రాలు కూడా డిసెంబర్‌ 10న థియేటర్లలో సందడి చేయనున్నాయి. 

ఆహా

* పుష్పక విమానం డిసెంబర్‌ 10

అమెజాన్‌ ప్రైమ్‌

* ద ఎక్స్‌పాన్స్‌ (వెబ్‌ సిరీస్‌ సీజన్‌-6) డిసెంబరు10

* ఎన్‌కౌంటర్‌ (హాలీవుడ్‌ మూవీ) డిసెంబరు10

డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌

* ఆర్య (హిందీ వెబ్‌ సిరీస్‌ సీజన్‌-2) డిసెంబరు 10

నెట్‌ఫ్లిక్స్‌

* ద లైట్‌ హౌజ్‌ (హాలీవుడ్‌) డిసెంబరు 6

* వాయిర్‌ డిసెంబరు 6

* టైటాన్స్‌ (వెబ్‌సిరీస్‌ సీజన్‌-3) డిసెంబరు 8

*అరణ్యక్‌ (హిందీ సిరీస్‌) డిసెంబరు 10

* ద అన్‌ ఫర్‌గివబుల్‌ (హాలీవుడ్‌) డిసెంబరు 10

జీ5

కాతిల్‌ హసీనోంకే నామ్‌ (హిందీ సిరీస్‌) డిసెంబరు 10

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top