సోనూ సూద్‌కు ఓ విగ్రహం | Temple Dedicated to Sonu Sood by Telangana Siddipet Villagers | Sakshi
Sakshi News home page

సోనూ సూద్‌కు ఓ విగ్రహం

Dec 21 2020 10:19 AM | Updated on Dec 21 2020 12:13 PM

Temple Dedicated to Sonu Sood by Telangana Siddipet Villagers  - Sakshi

సోనూ సూద్‌ విగ్రహానికి హారతి ఇస్తోన్న చెలిమితండా వాసులు

సాక్షి, సిద్దిపేట్‌: లాక్‌డౌన్‌ సమయంలో కష్టాల్లో ఉన్న వారికి  విశేషమైన సేవలందించి రియల్‌ హీరోగా నిలిచారు బాలీవుడ్‌ నటుడు సోనూ సూద్‌. ఈ నేపథ్యంలో ఓ అభిమాని సోనూ సూద్‌కి విగ్రహం ఏర్పాటు చేశాడు. అది కూడా సొంత ఖర్చుతో. వివరాలు.. సిద్ధిపేట జిల్లా మద్దూరు మండలం దుబ్బ తండా పరిధిలోని చెలిమితండాకు చెందిన రాజేష్‌ రాథోడ్‌కు సోనూసూద్‌ అంటే అభిమానం. కరోనా సమయంలో ఆయన చేపట్టిన సేవా కార్యక్రమాలకు ముగ్ధుడైన రాజేష్‌ తమ తండాలో సోనూ సూద్‌ కోసం విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు. రాజేష్‌ సొంత ఖర్చుతో ఏర్పాటు చేయడం గొప్ప విషయమని తండా వాసులు అభినందించారు. ఇక ఆదివారం స్థానికులు విగ్రహానికి పూజలు నిర్వహించి హారతి ఇచ్చారు. (వాళ్లు తల్లిదండ్రులతో సమానం: సోనుసూద్‌)

ఈ సందర్భంగా రాజేష్‌ మాట్లాడుతూ.. ‘సోనూ సూద్‌ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల ప్రజలకు సాయం చేశారు. ఆయన సేవలను గుర్తించి ఐక్యరాజ్యసమితి ఎస్‌డీజీ స్పెషల్‌ హ్యుమానిటేరియన్‌ యాక్షన్‌ అవార్డు ప్రకటించింది. ఈ నేపథ్యంలో మేం సోనూ సూద్‌కి  విగ్రహం ఏర్పాటు చేసి మా అభిమానాన్ని చాటుకుంటున్నాం. దేవతల మాదిరిగానే ప్రతిరోజు సోనూ సూద్‌ విగ్రహానికి పూజలు చేస్తాం’ అని తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement