SS Rajamouli: మహేశ్ మూవీ లైన్ చెప్పిన జక్కన్న, పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్

బాహుబలి సిరీస్‌తో ఇండియన్ ఫిల్మ్ స్థాయిని పెంచేశాడు దర్శకధీరుడు రాజమౌళి. తర్వాత తీసిన ఆర్ఆర్ఆర్ అంతకు మించి వర్క్ అవుట్ అయింది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఏకంగా రూ.1100 కోట్లు కొల్లగొట్టింది. దీంతో రాజమౌళి కాన్ఫిడెన్స్ మరింత పెరిగింది. దీంతో ఆయన తదుపరి చిత్రంపై అందరిలో ఆసక్తి నెలకొంది. ఈసారి ఎలాంటి స్క్రిప్ట్‌తో రాబోతున్నాడా? అని సినీ ప్రియులంత ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే రాజమౌళి తన నెక్ట్ మూవీని సూపర్ స్టార్ మహేశ్ బాబుతో ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే.
చదవండి: పెళ్లి చేసుకోకపోయినా.. పిల్లల్ని కంటాను: ‘సీతారామం’ బ్యూటీ షాకింగ్ కామెంట్స్
వీరిద్దరి కాంబోలో సినిమా అనగానే అందరిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన లైన్ చెప్పేసి మరింత హైప్ క్రియేట్ చేశాడు జక్కన్న. కాగా సెప్టెంబర్ 8న ఘనంగా ప్రారంభమైన టొరంటో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్-2022(టీఫ్)లో జక్కన్న పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తాజాగా జరిగిన ఈవెంట్‌లో రాజమౌళికి మహేశ్‌తో చేయబోయే చిత్రంపై ప్రశ్న ఎదురైంది. ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ.. ‘ప్రిన్స్ మహేశ్ బాబుతో నేను చేయబోచే చిత్రం ఫుల్ యాక్షన్ అడ్వెంచర్. గ్లోబ్ ట్రూటింగ్ అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రయాణం చేయడం. ఈ మూవీలో మహేశ్ జేమ్స్ బాండ్‌కు ఏమాత్రం తీసిపోడు’ అంటూ సర్‌ప్రైజ్ ఇచ్చాడు జక్కన్న.
చదవండి: కృష్ణంరాజు ముగ్గురు కూతుళ్ల ఏం చేస్తుంటారో తెలుసా?
అదే విధంగా గతంలో ఈ కథారచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కూడా ఈ కాంబోపై స్పందిస్తూ ఈ కథ ఆఫ్రికన్ ఫారెస్ట్ నేపథ్యంలో సాగుతుందని చెప్పిన సంగతి తెలిసిందే. మొత్తానికి మహేశ్-జక్కన్నల ప్రాజెక్ట్ లైన్ బయటకు రావడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు. అలాగే ఇటీవల మహేశ్-రాజమౌళితో సినిమాపై స్పందిస్తూ.. రాజమౌళితో ఒక్క సినిమా చేస్తే 25 సినిమాలు చేసినట్టేనని చెప్పారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కబోయే ఈ చిత్రానికి విజయేంద్ర ప్రసాద్ కథను అందిస్తున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సెట్స్‌పైకి రానుంది.
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు