
సౌత్ లో లేడీ సూపర్ స్టార్ సమంత ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెల్సిందే. ది ఫ్యామిలీ మేన్ 2తో బాలీవుడ్ లోనూ అభిమానులను సంపాదించుకుంది సామ్. ప్రస్తుతం చేతినిండా చిత్రాలతో బిజీగా ఉంది. అయినప్పటికీ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటుంది. అయితే సామ్ ఊరికే టైంపాస్ కోసం సోషల్ మీడియా యూజ్ చేయట్లేదు. దానిని కూడా ఆదాయ వనరుగా మార్చుకొని డబ్బులు సంపాదిస్తోంది. ఆమె ఇన్‌స్టాలో ఒక్క పోస్ట్ పెడితే చాలు.. కోట్ల రూపాయలు ఆమె అకౌంట్‌లో పడిపోతాయి.
(చదవండి: చాలా మందికి అప్పు ఇచ్చా.. తిరిగి ఇవ్వలేదు : గోపీచంద్)
ఇన్ స్టాలో సమంతకు రెండు కోట్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. అందుకే సామ్ ఏ పోస్ట్ పెట్టిన ఆ పోస్ట్ నిముషాల్లో వైరల్ అవుతుంది.పైగా సామ్ ఫ్యాన్స్ కాస్త నెక్ట్స్ లెవల్లో కనిపిస్తారు.పోస్ట్ ను షేర్ చేస్తూ ట్రెండింగ్ లోకి తీసుకొస్తారు.అందుకే సామ్ తన ఇన్ స్టా అకౌంట్ లో ఒక్క పోస్ట్ పెడితే చాలు కోట్ల రూపాయల పారితోషికాన్ని అందిస్తున్నాయట వ్యాపార సంస్థలు.
ఇలా మొత్తంగా సమంత ఒక్క ఇన్‌స్టా ఖాతా నుంచే నెలకు రూ. 3 కోట్లు అందుకుంటుందంటా. ఇన్‌స్టాలో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న విరాట్ కొహ్లీ..ఒక్క బ్రాండ్‌ని ప్రమోట్ చేయాలంటే..రూ. 50 కోట్లు తీసుకుంటాడట. ఆ తర్వాత ప్రియాంక చోప్రా ఒక్క పోస్ట్‌కు రూ.3 కోట్లు, షారుఖ్, ఆలియా భట్, కత్రినా రూ.కోటి చొప్పున తీసుకుంటారట. మొత్తానికి ఇన్ స్టా ద్వారా సంపాదన అనేది సినిమాను మించిన ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది.