Tollywood Actress Rashmika Mandanna Crosses 20 Million Followers On Instagram - Sakshi
Sakshi News home page

సోషల్‌ మీడియాలో దూసుకుపోతున్న రష్మిక మందన్నా

Aug 10 2021 1:16 PM | Updated on Aug 10 2021 3:41 PM

Rashmika Mandanna Crossed 20 Million Followers In Instagram - Sakshi

నేషనల్‌ క్రష్‌, మోస్ట్‌ డిజైరబుల్‌ ఉమెన్‌ రష్మిక మందన్నాకు మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని, తన ఫొటో షూట్‌లకు సంబంధించిన ఫొటోలను తరచూ అభిమానులతో పంచుకుంటూ సోషల్‌ మీడియాలో ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటుంది. అలా సోషల్‌ మీడియాలో ఎప్పుడూ ఫ్యాన్స్‌కు దగ్గరగా ఉండే ఆమెకు ఫాలోయింగ్‌ కూడా ఎక్కువే. ఈ క్రమంలో ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ నేషనల్‌ క్రష్‌ 20 మిలియన్లపైగా ఫాలోవర్స్‌ను సంపాదించుకుని రికార్డు సృష్టించింది.

ఈ విషయాన్ని స్వయంగా రష్మిక షేర్‌ చేస్తూ.. ‘20 మిలియన్ల అనుభూతి ఉంది. లవ్‌ యూ’ అనే క్యాప్షన్‌తో పోస్టు షేర్‌ చేసింది. రష్మిక పోస్టు చూసిన మిగతా హీరోహీరోయిన్లు ఆమె అభినందనలు తెలుపుతున్నారు. రష్మిక పోస్టుపై కీర్తి సురేశ్‌ స్పందిస్తూ.. ‘వావ్‌! శుభాకాంక్షలు రాక్‌స్టార్‌’ అంటూ కామెంట్‌ చేసింది. కాగా రష్మిక ప్రస్తుతం తెలుగులో పుష్ప, హిందీలో గుడ్‌బై సినిమాల షూటింగ్‌తో బిజీగా ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement