
ఎంత పెద్ద ఇంటర్నేషనల్ స్టార్ అయినా భార్య బ్యాగులు మోయడం మాత్రం తప్పించుకోలేడు, షాపింగ్ బ్యాగులు మోసిన ఫోటో మాత్రం అదుర్స్ అంటూ కామెంట్లు చేస్తున్నా
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్ సినిమాతో మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఈ దేశంలోనే కాదు, విదేశాల్లోనూ ఆయన ఎక్కడికి వెళ్లినా ఆటోగ్రాఫ్, ఫోటోగ్రాఫ్ అంటూ ఆయన వెంటపడుతున్నారు అభిమానులు. ఆస్కార్ వేడుకల కోసం ఇప్పటికే అమెరికా వెళ్లిన చరణ్ హాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూలిస్తూ యమ బిజీగా ఉన్నాడు. అయితే తనకు దొరికిన చిన్న బ్రేక్‌లో భార్య ఉపాసనతో కలిసి షాపింగ్‌కు వెళ్లాడు. ఉపాసన షాపింగ్ పూర్తయ్యాక ఆ బ్యాగులు మోస్తూ తన వైపే తదేకంగా చూస్తూ ఆమె వెనకాలే నడిచాడు.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇది చూసిన అభిమానులు.. 'ఎంత పెద్ద ఇంటర్నేషనల్ స్టార్ అయినా భార్య బ్యాగులు మోయడం మాత్రం తప్పించుకోలేడు', 'షాపింగ్ బ్యాగులు మోసిన ఫోటో మాత్రం అదుర్స్', 'పెళ్లైతే అంతే, భార్య షాపింగ్ సంచులు మోయాల్సిందే' అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే మార్చి 12న 95వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు పాట ఆస్కార్‌కు నామినేట్ అయిన విషయం తెలిసిందే! మరి ఈ పాట ఆస్కార్ ఎగరేసుకుపోతుందేమో చూడాలి!