రాజశేఖర్‌ ఆరోగ్యంపై శివాత్మీక ట్వీట్స్‌.. | Rajasekhar Fighting Hard Daughter Shivathmika Gives Health Update | Sakshi
Sakshi News home page

నాన్న కోవిడ్‌తో పోరాడుతున్నారు: శివాత్మిక

Oct 22 2020 10:47 AM | Updated on Oct 22 2020 1:16 PM

Rajasekhar Fighting Hard Daughter Shivathmika Gives Health Update - Sakshi

హీరో రాజశేఖర్‌ కుటుంబానికి కరోనా సోకిన సంగతి తెలిసిందే. రాజశేఖర్, ఆయన భార్య జీవిత, వాళ్ల కుమార్తెలు శివానీ, శివాత్మిక కోవిడ్‌ బారినపడ్డారు. ప్రస్తుతం వీరంతా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అయితే వారి కుమార్తెలు శివాత్మిక, శివానీ వెంటనే కోలుకోగా.. రాజశేఖర్, జీవితలకు చికిత్స కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రాజశేఖర్‌ ఆరోగ్య పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. ఈ విషయంపై క్లారిటీ ఇస్తూ ఆయన కుమార్తె శివాత్మిక అరగంటలో రెండు ట్వీట్లు చేశారు. తన తండ్రి ఆరోగ్య పరిస్థితి ఇబ్బందికరంగా ఉందంటూ శివాత్మిక మొదటి ట్వీట్‌ చేశారు. అందరి అభిమానంతో క్షేమంగా తిరిగొస్తారని ఆశిస్తున్నానని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. (చదవండి: మేం బాగానే ఉన్నాం)

మరి కాసేపటికే.. నాన్న బాగానే ఉన్నారంటూ... మరో ట్వీట్‌ చేశారు శివాత్మిక. కరోనా నుంచి కోలుకుంటున్నారంటూ రెండో ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇక జీవితకు కూడా కరోనా నెగిటివ్‌గా వచ్చినట్లు తెలిసింది. 

Advertisement
 
Advertisement
Advertisement