విస్కీ గ్లాసుతో షాకిచ్చిన పాయ‌ల్ రాజ్‌పుత్ | Payal Rajput Shares Pic With Whiskey Glass | Sakshi
Sakshi News home page

విస్కీ తాగుతున్న టాలీవుడ్ హీరోయిన్‌!

Nov 12 2020 6:06 PM | Updated on Nov 12 2020 6:33 PM

Payal Rajput Shares Pic With Whiskey Glass - Sakshi

మందు తాగ‌డం ఏం రంగంలో ఉన్న‌వారికైనా కామ‌న్‌. కానీ సినిమా ఫీల్డ్‌లో న‌టుల‌తో పాటు కొంద‌రు న‌టీమ‌ణులు కూడా అప్పుడప్పుడు ఓ పెగ్గు వేస్తుంటారు. అయితే కొంద‌రు దీన్ని సీక్రెట్‌గా ఉంచితే మ‌రికొంద‌రు మాత్రం అస్స‌లు మొహ‌మాట‌ప‌డ‌కుండా అంద‌రిముందే ఒప్పేసుకుంటారు. తాజాగా సోష‌ల్ మీడియాలో పాయ‌ల్ రాజ్‌పుత్ మందుగ్లాసు ప‌ట్టుకున్న ఫొటో తెగ వైర‌ల్ అవుతోంది. ఈ బోల్డ్ బ్యూటీ తాగ‌డం ఎప్పుడు మొద‌లు పెట్టింద‌బ్బా అని ఆమె అభిమానులు కొంద‌రు ఆలోచ‌న‌లో ప‌డ్డారు.  (చ‌ద‌వండి: యజమాని, పని మనిషి ప్రేమ కథ)

అయితే అలాంటిదేమీ లేదు. ఆమె ముందు ఓ ప్ర‌ముఖ బ్రాండ్‌కు చెందిన‌ విస్కీ బాటిల్ ఉండ‌గా, దాన్ని గ్లాసులో ఒలికించి చేత ప‌ట్టుకుని సౌమ్యంగా న‌వ్వులు చిందిస్తోంది. అంటే ఆమె స‌ద‌రు విస్కీ బ్రాండ్ యాడ్ కోస‌మే అలా చేసిందని సులువుగా స్ప‌ష్ట‌మ‌వుతోంది. తెలంగాణ‌లో ఈ కొత్త బ్రాండు భ‌లే బాగుందంటూ ప్ర‌మోట్ చేసింది. కాగా తెలుగులో హీరోలు సందీప్ కిష‌న్‌, నిఖిల్ మందు బ్రాండ్ల‌ను ప్ర‌మోట్ చేశారు కానీ ఓ హీరోయిన్ ఇలా ధైర్యం చేసి ముందుకు రావ‌డం చాలా అరుదు. ఇక పాయ‌ల్ కెరీర్ విష‌యానికి వ‌స్తే తొలి చిత్రం 'ఆర్ఎక్స్‌100' స‌క్సెత్‌తో ఎన్నో ఆఫ‌ర్లు ఆమె ఎదుట వాలాయి. దీంతో వ‌చ్చిన అవ‌కాశాన్ని వ‌దులుకోకుండా ఎన్నో సినిమాలు చేసుకుంటూ పోయిందే కానీ పెద్ద హిట్ మాత్రం అందుకోలేదు. దీంతో మ‌ళ్లీ త‌న మొద‌టి హీరో కార్తికేయ‌తో క‌లిసి 'అన‌గ‌న‌గా ఓ అతిథి'లో న‌టించ‌గా. ఈ చిత్రం 'ఆహా'లో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది  (చ‌ద‌వండి: నా కల నెరవేరింది: పాయల్‌ రాజ్‌పుత్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement