
బాలీవుడ్ హీరోయిన్ నర్గీస్ ఫక్రి (Nargis Fakhri) ఈ ఏడాది ఫిబ్రవరిలో సీక్రెట్‌గా పెళ్లి చేసుకుంది. వ్యాపారవేత్త టోనీ బేగ్ (Tony Beig)ను పెళ్లాడింది. అమెరికాలోని కాలిఫోర్నియాలో వివాహ తంతు పూర్తి చేసుకుని అట్నుంచటే కొత్త దంపతులు స్విట్జర్లాండ్ వెళ్లారు. అయితే తనకు మ్యారేజ్ అయిందని నర్గీస్ ఎక్కడా చెప్పలేదు, అలాగే పెళ్లి ఫోటోలు కూడా షేర్ చేయలేదు. ఇంతవరకు జంటగా కనిపించిందీ లేదు. పెళ్లయిన ఆరు నెలల తర్వాత తొలిసారి భర్తతో కనిపించిందీ బ్యూటీ. ముంబైలో నీతా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్ (NMACC)లో ఆగస్టు 30న జరిగిన ఓ కార్యక్రమానికి భర్తతో కలిసి హాజరైంది.
పెళ్లయ్యాక తొలిసారి..
వీరితో కొరియోగ్రాఫర్, దర్శకురాలు ఫరా ఖాన్ (Farah Khan) కూడా జత కలిసింది. రెడ్ కార్పెట్‌పై నర్గీస్, ఫరా ఖాన్ జంటగా ఫోటోలు దిగారు. అనంతరం ఫరా.. నీ భార్య పక్కన వచ్చి నిల్చో అంటూ టోనీని పిలిచింది. దీంతో వారిద్దరి పెళ్లి జరిగిపోయిందని అభిమానులకు క్లారిటీ వచ్చేసింది. నర్గీస్ ఫక్రి.. మద్రాస్ కేఫ్, డిష్యుం, హౌజ్‌ఫుల్ 3, అమావాస్... తదితర సినిమాల్లో నటించింది. హాలీవుడ్ సినిమా ‘స్పై’లోనూ అలరించింది. చివరగా హౌస్‌ఫుల్ 5 మూవీలో కనిపించింది. దాదాపు రూ.250 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా రూ.288 కోట్లు రాబట్టింది.