Naga Chaitanya Followed Samantha To Play Negative Role In Web Series - Sakshi
Sakshi News home page

Samantha - Naga Chaitanya: ఆ విషయంలో సమంతను ఫాలో అవుతున్న నాగచైతన్య!

Jun 21 2022 2:04 PM | Updated on Jun 21 2022 3:33 PM

Naga Chaitanya Followed Samantha To Play Negative Role In Web Series - Sakshi

నాగ చైతన్య, సమంత విడాకులు తీసుకొని చాలా రోజులవుతోంది. ప్రస్తుతం ఎవరి జీవితాల్లో వారు బిజీగా ఉన్నారు. కానీ.. ఇప్పటికీ వీరిద్దరు ఒక విషయంలో ఒకరినొకరు ఫాలో అవుతున్నారు

నాగ చైతన్య, సమంత విడాకులు తీసుకొని చాలా రోజులవుతోంది. ప్రస్తుతం ఎవరి జీవితాల్లో వారు బిజీగా ఉన్నారు. కానీ.. ఇప్పటికీ వీరిద్దరు ఒక విషయంలో ఒకరినొకరు ఫాలో అవుతున్నారు అంటున్నారు నెటిజన్స్. సామ్‌ బాటలోనే విలనీ రోల్‌ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాడు నాగ చైతన్య. 

గతేడాది అమెజాన్ ప్రైమ్ నిర్మించిన ది ఫ్యామిలీ మేన్ 2తో సమంత సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఈ వెబ్ సిరీస్ లో క్యారెక్టర్‌తో దేశవ్యాప్తంగా సమంతకు ఫ్యాన్స్ ఏర్పడ్డారు. ఆమె చేసిన విలనీ ఈ  వెబ్ సిరీస్ ను నెక్ట్స్ లెవల్ కు తీసుకెళ్లింది. ఇప్పుడు అదే అమెజాన్ ప్రైమ్ నిర్మిస్తున్న దూత అనే వెబ్ సిరీస్ కోసం నాగ చైతన్య కూడా విలన్ రోల్ చేస్తున్నాడని సమాచారం.

త్వరలో ప్రైమ్ తీసుకురాబోతున్న అతి పెద్ద వెబ్ సిరీస్ మేళాలో నాగ చైతన్య నటిస్తున్న దూత గురించి ఉంది. అందుకు సంబంధించిన లుక్ కూడా రివీల్ అయింది. అయితే క్యారెక్టర్ మాత్రం బయటికి రాలేదు. ఓటీటీ వరల్డ్ లో మాత్రం నాగ చైతన్య ఈ వెబ్ సిరీస్ లో విలన్ రోల్ చేస్తున్నాడని  బాగా ప్రచారం సాగుతోంది.

హారర్ థ్రిల్లర్ జానర్ లో దూత వెబ్ సిరీస్ తెరకెక్కుతోంది. నాగచైతన్య ఫేవరేట్ డైరెక్టర్ విక్రమ్ కుమార్ డైరెక్ట్ చేస్తున్నాడు. చైతూ ఇమేజ్ కు తగ్గట్లు దూత వెబ్ సిరీస్ తెరకెక్కిస్తున్నాడు. మాలీవుడ్ బ్యూటీ పార్వతి, ప్రియా భవాని శంకర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ ఏడాది చివర్లో ఈ వెబ్‌ సిరీస్‌ విడుదల కానుంది. రిలీజ్ తర్వాత చైతూ ఏ రేంజ్ లో సెన్సేషన్  సృష్టిస్తాడో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement