మరోసారి వాయిదా పడిన ‘లవ్‌స్టోరీ’, మూవీ టీం వివరణ | Sakshi
Sakshi News home page

మరోసారి వాయిదా పడిన ‘లవ్‌స్టోరీ’, మూవీ టీం వివరణ

Published Fri, Sep 10 2021 5:16 PM

Naga Chaitanya and Sai Pallavi Love Story Movie Release Postponed Again - Sakshi

ప్రస్తుతం టాలీవుడ్‌లో విడుదల కాబోయే పెద్ద సినిమాల్లో సెన్సిబుల్‌ డైరెక్టర్‌ శేఖర్‌ కమ్ముల ‘లవ్‌స్టోరీ’ ఒకటి. నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఈ సినిమాను ఓటీటీలో కాకుండా థియేటర్లోనే విడుదల చేయాలని చిత్ర బృందం గట్టిగా నిర్ణయించుకుని ఇంతకాలం వెయిట్‌ చేశారు. ఇక పూర్తి స్థాయిలో థియేటర్లు తెరుచుకోవడంతో వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్‌ 10న ఈ మూవీని విడుదల చేయబోతున్నట్లు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. తీరా ఆ తేదీ రానే వచ్చింది. కానీ లవ్‌స్టోరీ మాత్రం థియేటర్‌లోకి రాలేదు. దీంతో ప్రేక్షకులకు నిరాశే ఎదురైంది.  

చదవండి: ‘ఆ రెండు సినిమాలు తీయకపోతే నా జీవితానికి అర్థం లేదు’

ఈ నేపథ్యంలో మరోసారి ‘లవ్‌స్టోరీ’ మూవీని వాయిదా వేసినట్లు తాజాగా మేకర్స్‌ ప్రకటించారు. ఈ మేరకు ట్విటర్‌లో రిలీజ్‌ డేట్‌తో కూడిన పోస్టర్‌ను షేర్‌ చేస్తూ.. ‘కొన్ని అనివార్య కారణాల వల్ల మూవీని వాయిదా వేయాల్సి వచ్చింది. ఎప్పుడెప్పుడూ లవ్‌స్టోరీ మీకు అందించాలా అని మేము కూడా ఆసక్తిగా ఉన్నాం. ఈ మేరకు సెప్టెంబర్‌ 24 ప్రపంచ వ్యాప్తంగా మూవీని విడుదల చేయబోతున్నాం’ అంటూ మేకర్స్‌ స్పష్టం చేశారు. కాగా కె. నారాయణదాస్‌ నారంగ్, పి. రామ్మోహన్‌ రావు నిర్మించిన ఈ చిత్రంలో  సీనియర్ హీరోయిన్ దేవయాని కీలక పాత్ర పోషించగా.. రావు రమేశ్ .. పోసాని కృష్ణ మురళి ముఖ్యమైన ప్రధాన పాత్రలు పోషించారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement