రాముడి పాత్రలో ప్రభాస్‌.. ఎగ్జైటింగ్‌గా ఉంది, నాగ్‌ అశ్విన్ | Nag Ashwin Says Excited To See Prabhas As Lord Rama in Adipurush - Sakshi
Sakshi News home page

రాముడి పాత్రలో ప్రభాస్‌.. ఎగ్జైటింగ్‌గా ఉంది!

Aug 18 2020 3:50 PM | Updated on Aug 18 2020 5:18 PM

Nag Ashwin Says Excited To See Prabhas As Lord Rama Adipurush - Sakshi

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ ‘ఆదిపురుష్‌’ సినిమాతో బాలీవుడ్‌కు డైరెక్ట్‌ ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. అజయ్‌ దేవ్‌గణ్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన పిరియాడికల్‌ సినిమా 'తాన్హాజీ' ద‌ర్శ‌కుడు ఔంరౌత్‌ ఈ భారీ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఇందుకు సంబంధించి మంగళవారం సోషల్‌ మీడియా వేదికగా అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ రావడంతో డార్లింగ్‌ అభిమానులు సంతోషంలో మునిగిపోయారు. ఇక మూవీ టైటిల్‌ పోస్టర్‌లో హ‌నుమంతునితో పాటు రామాయణంలో కనిపించే పలువురు మునుల పాత్రలను ప్రతిబింబించేలా చిత్రాలు ఉండటం సహా.. "చెడుపై మంచి సాధించే విజ‌యాన్ని పండ‌గ ‌చేసుకుందాం" అనే క్యాప్ష‌న్‌ ఫిక్స్‌ చేయడంతో ఇది పౌరాణిక చిత్రమేనని, పోస్టర్‌లో ఉన్న ఫోజుని బట్టి ప్రభాస్‌ ఈ సినిమాలో రాముడి క్యారెక్టర్‌ చేయనున్నాడని చాలా మంది ఫిక్సయిపోయారు. (ప్ర‌భాస్ 22: అద‌ర‌గొడుతున్న పోస్ట‌ర్‌)

తాజాగా డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ తన ట్వీట్‌తో ఈ ఊహాగానాలన్నీ నిజమేనని స్పష్టమయ్యాయి. ‘‘ప్రభాస్‌ గారిని రాముడి పాత్రలో చూసేందుకు ఎంతో ఉత్సుకతతో ఎదురుచూస్తున్నా. ఇంతకు ముందు చాలా కొద్దిమంది మాత్రమే వెండితెరపై ఈ పాత్రలో కనిపించారు’’ అంటూ ఆదిపురుష్‌ చిత్ర బృందానికి గుడ్‌లక్‌ చెప్పారు. కాగా ప్రభాస్‌ ప్రస్తుతం నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో బాలీవుడ్‌ భామ దీపికా పదుకొనె హీరోయిన్‌గా కనిపించనున్నారు. 3డీలో తెరకెక్కనున్న ‘ఆదిపురుష్‌’ మోషన్‌ పోస్టర్‌ను తాజాగా విడుదల చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement