Mr. Bean Aka Rowan Atkinson : మిస్టర్‌ బీన్‌ మరణించినట్లు ప్రచారం.. ఫ్యాన్స్‌ ఫైర్‌

Mr Bean Aka Rowan Atkinson Is Rumored To Be Dead And Goes Viral - Sakshi

Mr Bean Aka Rowan Atkinson Is Rumored To Be Dead And Goes Viral: ప్రస్తుత సమాజంలో సోషల్‌ మీడియా వాడకం ఎక్కువైపోయింది. ​అందులో ఎన్నో వార్తలు చక్కర్లు కొడతాయి. ఆ వార్తలు సమాచారం అందించేలా ఉన్నా, కొన్నిసార్లు తప్పుడు వార్తలే ఎక్కువ ప్రచారం అవుతుంటాయి. ఉదాహరణకి సెలబ్రిటీల విడాకులు, మరణాలు, వింత సంఘటనలు అంటూ పలు పోస్ట్‌లు వైరల్‌ అవుతుంటాయి. ఈ పుకార్లకు బాధితులైనవారు స్పందించకుండా ఉండలేరు. ఇక మరణించినట్లు వచ్చిన వార్తలపై అయితే వారు 'మేము బతికే ఉ‍న్నాం' అని చెప్పినా సంఘటనలు ఎన్నో ఉన్నాయి. తాజాగా ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది. 

పరిచయం అక్కర్లేని పేరు మిస్టర్‌ బీన్‌. తన అద్భుతమైన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను గెలుచుకున్నారు. ఆయన అసలు పేరు రోవన్‌ అట్కిన్సన్‌. ఆయన పోషించిన పాత్ర పేరు 'మిస్టర్‌ బీన్‌'. ఈ పాత్ర తొలిసారిగా 1990లో పరిచయం అయింది. దీని తర్వాత క్రమంగా ప్రపంచవ్యాప్తంగా పాపులరైంది. అప‍్పటినుంచి రోవన్‌ అట్కిన్సన్‌ను అందరూ మిస్టర్‌ బీన్‌ అనే పిలిచేవారు. అయితే ఇటీవల ఈ బ్రిటీష్‌ నటుడు ఇక లేరంటూ ఓ వార్త సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్‌ అయింది. రోవాన్‌ చనిపోయాడంటూ ఓ ప్రసిద్ధ ఇంటర‍్నేషనల్‌ న్యూస్‌ చానల్‌ ప్రసారం కూడా చేసింది. ఈ వార్త చూసిన రోవన్‌ అభిమానులు కలత చెందారు. ఆయన చనిపోయాడని నిజంగానే భావించి కొంతమంది రిప్‌ (RIP) మిస్టర్‌ బీన్‌ అని పోస్ట్‌లు కూడా పెట్టారు. తర్వాత ఇది పూర్తిగా ఫేక్‌ న్యూస్‌ అని తెలిసి ఫైర్‌ అయ్యారు. 

'ఫాక్స్ న్యూస్' తన ట్విటర్‌ అకౌంట్‌లో ‘ఫాక్స్ బ్రేకింగ్ న్యూస్ – మిస్టర్ బీన్ (రోవన్ అట్కిన్సన్) 58 సంవత్సరాల వయసులో కారు ప్రమాదంలో మరణించారు’ అంటూ లింక్‌పై క్లిక్ చేయండి అని పోస్ట్ చేసింది. త‌ప్పుడు వార్త‌ని ప్ర‌చారం చేసినందుకు అంతర్జాతీయంగా ఉన్న రోవన్ అభిమానులు ఆ న్యూస్ ఛానల్‌పై మండిపడ్డారు. అయితే రోవన్ అట్కిన్సన్ మరణించినట్లు వార్తలు రావడం ఇదే మొదటిసారి కాదు. మిస్టర్ బీన్ 18 మార్చి 2017న రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లు ఇంతకు ముందు కూడా వార్తలు రాగా ఆయన బాగానే ఉన్నానని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం రోవన్ ప్రముఖ హాలీవుడ్‌ సిరీస్ ‘పీకీ బ్లైండర్స్‌’లో హిట్లర్ పాత్రను పోషించబోతున్నాడు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top