Lyca Productions Announces Rajinikanth's 170 Movie With Director TJ Gnanavel - Sakshi
Sakshi News home page

Rajinikanth 170 Movie: అఫీషియ‌ల్‌: రజనీకాంత్‌ 170 చిత్రం అప్‌డేట్‌, ఆ సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌తో..

Mar 2 2023 1:34 PM | Updated on Mar 2 2023 1:47 PM

Lyca Productions Announces Rajinikanth 170 Movie With Director TJ Gnanavel - Sakshi

ఫలితాలతో సంబంధం లేకుండా సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. 70 ఏళ్లలో కూడా యంగ్‌ హీరోలకు పోటీగా బ్యాక్‌ టూ బ్యాక్‌ చిత్రాలను ప్రకటిస్తున్నారు. ప్రస్తుతం జైలర్‌ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్న ఆయన నెక్ట్స్‌ తన కూతురు సౌందర్య రజనీకాంత్‌ దర్శకత్వంలో వస్తున్న లాల్‌ సలామ్‌లో ఆయన గెస్ట్‌ రోల్‌ చేయబోతున్నారు.

మార్చి 7న సెట్స్‌పైకి రానున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌ నిర్మిస్తుంది. ఇదిలా ఉంటే ఇ‍ప్పుడు ఇదే బ్యానర్‌ నుంచి తలైవా 170వ చిత్రం రాబోతోంది. తాజాగా ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. ఈ రోజు(మార్చి 2న) లైకా సంస్థ చైర్మన్‌, స్టార్‌ ప్రొడ్యూసర్‌ సుభాకరణ్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా తలైవా ఫ్యన్స్‌కి లైకా ప్రొడక్షన్స్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. తలైవా 170వ చిత్రాన్ని తమ బ్యానర్లోనే నిర్మించబోతున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించింది.

కాగా ఇదే బ్యానర్లో రజనీ రోబో 2.0, దర్భార్‌ చిత్రాలు రూపొందాయి. ప్రముఖ తమిళ దర్శకుడు టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో తలైవా 170 సినిమా తెరకెక్కిబోతుంది. గతంలో​ ఆయన సూర్య జై భీమ్‌తో సంచలన విజయం అందుకున్నారు. ఈ క్రమంలో రజనీ 170 చిత్రాన్ని ఆయన ఏ రేంజ్‌లో ప్లాన్‌ చేశారనేది ఆసక్తిని సంతరించుకుంది. ఇక ఈ సినిమాకు రాక్ స్టార్ అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించనున్నాడు.  

Advertisement
 
Advertisement
Advertisement