రష్మికకు పోటీగా కృతీశెట్టి.. నేషనల్ క్రష్ కెరీర్ ఇక అయిపోయినట్టేనా?

చిత్ర పరిశ్రమలో హీరో హీరోయిన్లకు సక్సెస్ ఎంత ముఖ్యమో.. ఆ సక్సెస్ కెరీర్‌కు ఉపయోగపడేలా చేసుకోవడం అంతే ముఖ్యం. ఈ విషయంలో స్టార్ హీరోయిన్ రష్మిక ఫెయిల్ అయిందనే విషయం ఆమె కెరీర్ తీరు చూస్తుంటే అర్థమవుతుంది. వరుస విజయాలు వస్తున్న సమయంలో బాలీవుడ్‌కి మకాం మార్చి.. సౌత్‌లో ఉన్న ఇమేజ్‌ని పాడు చేసుకుంది. ప్రస్తుతం ఈ నేషనల్ క్రష్‌కు పుష్ప 2 మినహాయిస్తే.. చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. పోనీ బాలీవుడ్‌లో అయినా వరుస అవకాశాలతో దూసుకెళ్తుందా అంటే అదీ లేదు.
హిందీలో రష్మిక నటించిన మొదటి సినిమా ‘గుడ్‌బై’ బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తాపడింది. ఇక రెండో సినిమా మిషన్ మజ్ను ఓటీటీలో విడుదలకాగా.. దానికి కూడా పెద్దగా రెస్పాన్స్ రాలేదు. సందీప్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ‘యానిమల్’లో రష్మిక హీరోయిన్‌గా నటిస్తున్నా.. ఆమెకు అంతగా గుర్తింపు రావడం లేదు. ఫోకస్ అంతా రణ్‌బీర్ పైనే ఉంది. ఇక ఇటీవల విజయ్ సరసన ‘వారసుడు’లో నటించింది. అయితే అందులో రష్మిక పాత్ర నిడివి 20 నిమిషాలు కూడా లేదు. విజయ్ కోసమే ఆమె వారసుడులో నటించింది కానీ.. కెరీర్ పరంగా ఆమెకు ఎలాంటి ఉపయోగం లేదు.
ఇలా రష్మిక తీసుకున్న కొన్ని తప్పుడు నిర్ణయాల వల్లే ‘పుష్ప’ లాంటి సూపర్ హిట్ తర్వాత కూడా ఆమెకు అవకాశాలు రావడం లేదు. మరోవైపు టాలీవుడ్‌లో రష్మికకు పోటీగా చాలా మంది యంగ్ హీరోయిన్స్ వచ్చేస్తున్నారు. ముఖ్యంగా ఉప్పెన బ్యూటీ కృతీశెట్టి.. రష్మికకు గట్టి పోటీ ఇస్తుంది. ఈ మధ్య కాలంలో కృతీ ఖాతాలో ఒక్క హిట్ లేకపోయినా.. వరుస అవకాశాలతో దూసుకెళ్తుంది.
ప్రస్తుతం నాగచైతన్య హీరోగా నటిస్తున్న కస్టడీ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా మే 12న విడుదల కానుంది. తెలుగుతో పాటు మలయాళంలోనూ నటిస్తుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం కృతీ నటిస్తున్న చిత్రాలలో ఒకటి రెండు విజయం సాధిస్తే చాలు.. సౌత్‌లో స్టార్ హీరోయిన్‌గా అవతరిస్తుంది. ఫలితంగా రష్మికకు వచ్చే సినిమాలలో కొన్నింటిని ఈ ఉప్పెన బ్యూటీ ఎగరేసుకెళ్లే ఛాన్స్ ఉంది.
మరిన్ని వార్తలు :