జస్టిస్​ లీగ్ డైరెక్టర్​ ఆసక్తికర వ్యాఖ్యలు

Justice League Zack Snyder Wants To Direct Adult Movie In Past - Sakshi

హాలీవుడ్ స్టార్ దర్శకుడు జాక్​ స్నైడర్​.. స్లో మోషన్​ విజువల్స్​ స్పెషలిస్ట్​. ఒక కథను ఎంతగా ప్రేమించి తీస్తాడో ఆయన డైరెక్షన్​లోనే తెలిసిపోతుంటుంది. కానీ, అంత టాలెంట్ ఉన్నా... స్టోరీ టెల్లర్​గా మాత్రం ఆయనకు తక్కువ మార్కులే పడుతుంటాయి. అయితే తనలో చాలాకాలంగా అణుచుకున్న ఓ కోరికను టెలిగ్రాఫ్​ ఇంటర్వ్యూలో బయటపెట్టాడాయన.

నాకు ఎప్పటి నుంచో పోర్న్​ మూవీ తీయాలని కోరిక. కానీ, ఇంతవరకు ఆ అవకాశం రాలేదు. మనిషి శరీరం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి నాకు ఎక్కువ. ‘300’ సినిమా చూశాక చాలామంది అదే ప్రశ్న అడిగారు. ‘ఏం సార్​.. మీరు పోర్న్​ మూవీ తీయబోయి ఇది తీశారా?’ అని. అలాగే జస్టిస్​ లీగ్​ కట్​లోనూ కొన్ని సీన్లు పోర్న్​ మూవీస్​ మాదిరి ఎఫెక్ట్​తో ఉన్నాయని కొందరు అన్నారు. అడల్ట్ సినిమా తీయాలన్న నా కొరికే అలా చూపించిందేమో. నా దృష్టిలో శారీరక వాంఛలతో మనిషి రగిలిపోతుంటాడు. వాటిని అణుచుకోవడం ఎందుకనే ఫిలాసఫీ మీదే నేను ఎక్కువగా ఫోకస్ చేస్తుంటా. గతంలో పోర్న్​ తీయాలని రెండు, మూడుసార్లు ప్రయత్నించా. కానీ, ప్రొడక్షన్​ హౌజ్​లు ఒప్పుకోకపోవడంతో అది కుదరలేదు. ఛాన్స్​ దొరికితే తప్పకుండా తీస్తా. అలాగే ఆధ్యాత్మికం నేపథ్యంలోనూ ఓ సినిమా తీయాలని ఉంది” అని జాక్​ స్నైడర్​ తెలిపాడు. ఇక స్నైడర్​ డైరెక్ట్​ చేసిన ‘ఆర్మీ ఆఫ్​ ది డెడ్’​ ఈ మధ్యే నెట్​ఫ్లిక్స్​లో రిలీజ్​ అయ్యింది. అందులో ఓ బోల్డ్​ సన్నివేశాన్ని కావాలనే పెట్టినట్లు ఇంటర్వ్యూలో ఈ స్టార్ దర్శకుడు చెప్పడం విశేషం.


           
కాగా, హాలీవుడ్​లో 2004 నుంచి డాన్​ ఆఫ్​ ది డెడ్​తో మొదలైన స్నైడర్​ ప్రస్థానం.. 300, వాచ్​మెన్​, లెజెండ్ ఆఫ్​ ది గార్జియన్స్​, మ్యాన్​ ఆఫ్​ స్టీల్​, బ్యాట్​మ్యాన్​ వర్సెస్​ సూపర్​మ్యాన్​లతో కొనసాగింది. 2017లో 'జస్టిస్ లీగ్' మేజర్​ పోర్షన్​ జాక్ స్నైడర్ డైరెక్ట్ చేశాడు. అయితే కూతురి మరణంతో ఆయన ఆ సినిమా నుంచి తప్పుకోవడంతో మిగతా పోర్షన్​ను వేరేవాళ్లు డైరెక్ట్ చేశారు. ఆ మూవీ నిరాశపర్చడంతో అప్పటి నుంచి ‘స్నైడర్​ కట్’ కావాలంటూ డీసీ ఫ్యాన్స్​ డిమాండ్​ చేయడం మొదలుపెట్టారు. దీంతో జాక్​ స్నైడర్స్​ జస్టిస్ లీగ్ మార్చ్​ 18న హెచ్​బీవో ద్వారా రిలీజ్​ అయ్యింది. అయితే రన్​ టైం ఎక్కువగా ఉండడంతో పాటు ఈ సినిమాలోని సీన్లపై పెద్ద ఎత్తునే చర్చ జరిగింది.

చదవండి: ఆమె ఒంటి నిండా..

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top