Jeevitha Rajasekhar Wins 'Shekar' Movie Court Case Controversy - Sakshi
Sakshi News home page

Shekar Movie: 'శేఖర్' సినిమా వివాదం.. జీవితా రాజశేఖర్ గెలుపు?

May 23 2022 8:36 PM | Updated on May 23 2022 9:32 PM

Jeevitha Rajasekhar Wins 'Shekar' Movie Court Case Controversy - Sakshi

యాంగ్రీ స్టార్‌ రాజశేఖర్‌ హీరోగా నటించిన తాజా  చిత్రం శేఖర్. ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఫైనాన్షియర్ పరంధామరెడ్డి వేసిన కేసు కారణంగా ప్రదర్శన నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ‘శేఖర్‌’ చిత్రాన్ని నిలిపివేయాలని కోరుతూ ఆయన సిటీ సివిల్‌ కోర్టును ఆశ్రయించాడు. అయితే తాజాగా ఈ మూవీ నిలిపివేతపై కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని తెలుస్తోంది. ఈ కేసులో జీవితా రాజశేఖర్‌, శేఖర్‌ చిత్ర బృందానికి అనుకూలంగా కోర్టులో న్యాయమూర్తి మాట్లాడినట్లు సమాచారం. తాజాగా జరిగిన ఈ కేసు విచారణలో శేఖర్‌ మూవీ ప్రదర్శనను నిలిపివేయాలని తామెప్పుడూ చెప్పలేదని న్యాయస్థానం వ్యాఖ్యానించినట్లు తెలిసింది.

చదవండి: ప్రేమపై నోరు విప్పిన సాయి పల్లవి, ఏమన్నదంటే..

కొంతమంది ఉద్దేశపూర్వకంగా సినిమా ప్రదర్శనకు ఆటంకం కలిగించినట్లు సమాచారం. అయితే, కోర్టు సినిమా ప్రదర్శనకు ఎటువంటి అభ్యంతరం తెలుపలేదని తాజాగా జీవిత రాజశేఖర్‌, నిర్మాత తరపు న్యాయవాదులు తెలిపారు. శేఖర్ సినిమాను నిరభ్యంతరంగా ప్రదర్శించవచ్చని కోర్టు చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. ఇక ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను జీవితా రాజశేఖర్, నిర్మాత బీరం సుధాకర్ రెడ్డి తరపు న్యాయవాదులు మంగళవారం(మే 24న) విలేకరుల సమావేశంలో వెల్లడించనున్నారు. అయితే తాజాగా దీనిపై రాజశేఖర్‌ కూడా ట్వీట్‌ చేశాడు. ఆసత్య ప్రచారం వల్ల తమ సినిమాను నిలిపివేశారని, శేఖర్‌ మూవీపై కోర్టు స్టే ఇచ్చిందంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. కాగా ఈ సినిమాకు ఆయన సతీమణి జీవిత రాజశేఖర్‌ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.

చదవండి: ఎలాగో ఈ సైడ్‌ ఎఫెక్ట్స్‌ నుంచి తప్పించుకోలేను.. నటి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement