సైకిల్‌పై వచ్చి ఓటు వేసిన హీరో విజయ్

Hero Vijay Arrives In Cycle To Cast His Vote in Tamil Nadu Election Polling - Sakshi

సాక్షి, చెన్నై: వినూత్నమైన పనులు చేస్తూ నటుడు విజయ్‌ ఎప్పుడూ తన ప్రత్యేకతను చాటుకుంటాడు. మంగళవారం జరుగుతున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్‌ సైకిల్‌పై వచ్చి ఓటు వేశారు. పోలింగ్‌ కేంద్రంలో అభిమానులతో సెల్ఫీలకు పోజులిచ్చారు. ప్రస్తుతం ఆయన సైకిల్‌పై వచ్చిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. హీరో విజయ్‌ వేగంగా సైకిల్‌ తొక్కుతూ పోలింగ్‌ కేంద్రానికి వస్తుండగా రోడ్డుపై అభిమానులు అయన వెంట బైక్‌లతో అనుసరించారు. సాధారణ వ్యక్తిలా పోలింగ్‌ కేంద్రానికి విజయ్‌ సైకిల్‌ మీద వచ్చి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇప్పటికే పలువురు సినీ రాజకీయ ప్రముఖు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

అయితే హీరో విజయ్‌ తన ఇంటి నుంచి పోలింగ్‌ కేంద్రానికి వచ్చి ఓటు వేయడంపై కొందరు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక సోషల్‌ మీడియా ఈ వీడియోను చూసిన నెటిజన్లు హీరో విజయ్‌ బిల్డప్‌ కోసమే సైకిల్‌పై వచ్చాడంటూ ట్రోల్స్‌ చేస్తున్నారు. అయితే విజయ్‌ సైకిల్‌ మీద రావడనికి కారణం ఇదే అంటూ ఆయన సోషల్‌ మీడియా టీం ఓ ప్రకటన విడుదల చేసింది. తలాపతి విజయ్ సైకిల్‌పై వచ్చి ఓటు వేయడానికి కారణం ఉంది. పోలింగ్‌ బూత్ తన ఇంటి వెనుక వీధిలో ఉంది. అది ఒక ఇరుకైన వీధి, కారును అక్కడికి తీసుకెళ్లడం కష్టం. అందుకే ఆయన సైకిల్‌పై పోలింగ్‌ కేంద్రానికి వెళ్లారని, దీనికి వేరే కారణం లేదని విజయ్‌ సోషల్‌ మీడియా టీం పేర్కొంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top