RRR Movie: 'ఆర్‌ఆర్‌ఆర్‌'కు గూగుల్ స్పెషల్ సర్‌ప్రైజ్‌!

Google Gives Surprise To RRR Movie For Rajamouli - Sakshi

Google Gives Surprise To RRR Movie For Rajamouli: జూనియర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ మల్టీస్టారర్‌గా జక్కన్న రూపొందించిన భారీ బడ్జెట్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ఈ ఏడాది మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్స్‌ రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 1100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డు సృష్టించింది. విజువల్‌ ఎఫెక్ట్స్‌, మ్యూజిక్‌, యాక్టింగ్‌.. ఇలా అన్ని కోణాల్లో తిరుగులేదు అనిపించింది ఈ మూవీ. థియేటర్లలో కాసుల వర్షం కురిపించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఓటీటీలోనూ తన సత్తా చాటింది. ఓటీటీలో ఈ సినిమాను వీక్షించిన నెటిజన్స్‌, ప్రముఖ హాలీవుడ్‌ డైరెక్టర్లు సైతం ప్రశంసలు కురిపించారు. 

అయితే తాజాగా ఆర్‌ఆర్‌ఆర్‌ క్రేజ్‌ గుర్తించిన గూగుల్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. ప్రజలకు ఏ సందేహం కలిగిన గూగుల్‌ తల్లిని అడుగుతారన్న విషయం తెలిసిందే. ఇలా ఆర్‌ఆర్‌ఆర్‌ గురించి కొన్ని కోట్ల మంది గూగుల్‌లో సెర్చ్‌ చేశారు. అయితే తాజాగా 'ఆర్‌ఆర్‌ఆర్‌' గురించి సెర్చ్‌ చేసే వారికి ఒక సర్‌ప్రైజ్‌ కనిపిస్తుంది. ఆర్ఆర్‌ఆర్‌ అని గూగుల్‌లో టైప్‌ చేసి ఎంటర్‌ కొట్టగానే సెర్చ్‌ బార్‌ కింద ఒక బైక్‌, గుర్రం వెళ్తూ కనిపిస్తాయి. ఒకసారి బైక్‌ ముందు వస్తే, మరోసారి గుర్రం ముందు వస్తుంది. 

చదవండి: మహాత్మ గాంధీ హత్యోదంతంగా '1948 అఖండ భారత్‌'.. మూవీ రివ్యూ

కాగా 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో తారక్ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌ నడపగా, రామ్‌ చరణ్‌ గుర్రంపై స్వారీ చేసిన విషయం తెలిసిందే. అలాగే బైక్‌పై రామ్ చరణ్‌, గుర్రంపై ఎన్టీఆర్‌ వెళ్లే సన్నివేశాలు చిత్రంలో ఆకట్టుకున్నాయి. మొత్తంగా ఇటు నందమూరి, అటు మెగా అభిమానులను, ప్రేక్షకులకు ఈ సన్నివేశాలు గుర్తు తెచ్చేలా గూగుల్‌ ఈ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. ఈ సర్‌ప్రైజ్‌ ఇచ్చిన గూగుల్‌కు 'ఆర్‌ఆర్‌ఆర్‌' మూవీ టీమ్‌ ధన్యవాదాలు చెప్పింది. ''మమ్మల్ని సర్‌ప్రైజ్‌ చేసినందుకు, వరల్డ్‌వైడ్‌గా 'ఆర్‌ఆర్‌ఆర్‌'కు ఉన్న పాపులారిటీని గుర్తించినందుకు థ్యాంక్యూ గూగుల్‌'' అని పేర్కొంది. అలాగే గూగుల్‌లో 'ఆర్‌ఆర్‌ఆర్‌' అని సెర్చ్‌ చేసి స్క్రీన్‌షాట్‌ లేదా వీడియో తీసి RRR Take Over అనే హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్ మీడియాలో పోస్ట్ చేయమని ఆడియెన్స్‌ను కోరింది సినిమా చిత్రబృందం. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top