
కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన చిత్రం ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’. సంజనా ఆనంద్ హీరోయిన్‌గా నటించారు. శ్రీధర్ గాదె దర్శకత్వంలో కోడి దివ్య నిర్మింన ఈ చిత్రం సెప్టెంబరు 9న విడుదల కానుంది. ఈ చిత్రం కెమెరామేన్ రాజ్ కె నల్లి మాట్లాడుతూ – ‘‘నా చిన్నతనంలో ‘సఖి’, ‘బొంబాయి’ సినిమాలను స్ఫర్తిగా తీసుకుని సినిమాటోగ్రాఫర్ కావాలనుకున్నాను. దీంతో 2014లో సినిమాటోగ్రఫీ కోర్సు పూర్తి చేశాను.
ఆ తర్వాత ‘రారండోయ్ వేడుక చూద్దాం’, ‘అర్జున్ సురవరం’, ‘దేవదాస్’, ‘ఉప్పెన’ వంటి సినిమాలకు అసోసియేట్ కెమెరామేన్‌గా వర్క్ చేశాను. ‘ఉప్పెన’ సినిమా సమయంలో కృష్ణవంశీగారు కాల్ చేసి ‘రంగ మార్తాండ’ సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా తీసుకున్నారు. ఆ తర్వాత కిరణ్ అబ్బవరం చేసిన ‘సెబాస్టియన్ పీసీ 524’ సినిమాకు కెమెరామేన్‌గా చేశాను. ఇప్పుడు కిరణ్‌తో నేను చేసిన రెండో సినిమా ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’.
కిరణ్ చాలా కూల్ యాక్టర్. తను ఏ టెన్షన్‌లో ఉన్నా కూడా సీన్‌లోకి వచ్చేసరికి ఆ సన్నివేశానికి తగ్గట్లుగా భావోద్వేగాలు పండిస్తాడు. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. ఓ డెడ్‌లైన్ పెట్టుకుని వర్క్ చేశాను. నిర్మాత కోడి దివ్యగారు అందరికీ ఓ కంఫర్ట్ జోన్ క్రియేట్ చేసారు. కొత్తగా ఆలోచిస్తారు. ఇక నేను చేసిన ‘రంగ మార్తాండ’ సినిమా రిలీజ్‌కు రెడీగా ఉంది’’ అని చెప్పుకొచ్చారు.