
కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కె–ర్యాంప్’. జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో యుక్తి తరేజా హీరోయిన్ గా నటిస్తున్నారు. హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్స్‌పై రాజేష్ దండా, శివ బొమ్మకు నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది.
ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓపోస్టర్ రిలీజ్ చేసింది మూవీ టీమ్. ‘‘కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న 11వ చిత్రమిది. త్వరలో ఫస్ట్ లుక్‌ని విడుదల చేస్తాం’’ అన్నారు మేకర్స్. ఈ చిత్రానికి కెమేరా: సతీష్ రెడ్డి మాసం, సంగీతం: చేతన్ భరద్వాజ్, కో ప్రోడ్యూసర్: బాలాజీ గుట్ట.