కాన్స్‌ సందడి షురూ | Cannes Film Festival 2026: Aishwarya Rai and Alia Bhatt to return | Sakshi
Sakshi News home page

కాన్స్‌ సందడి షురూ

May 6 2026 2:23 AM | Updated on May 6 2026 2:23 AM

Cannes Film Festival 2026: Aishwarya Rai and Alia Bhatt to return

కాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ సందడి మొదలైంది. ఈ నెల 12 నుంచి 23 వరకు ఫ్రాన్స్‌ వేదికగా 79వ కాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ జరగనుంది. ప్రస్తుతం ఈ ఫెస్టివల్‌ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఏడాది ప్రధాన పోటీ విభాగాలకు దక్షిణ కొరియా సినీ దర్శకుడు పార్క్‌ చాన్‌–వూక్‌ జ్యూరీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. ఇక రెండు దశాబ్దాలుగా క్రమం తప్పకుండా ఈ చిత్రోత్సవాలకు హాజరవుతున్న ఐశ్వర్యా రాయ్‌ ఈ ఏడాది కూడా హాజరు కానున్నారని తెలిసింది. అలాగే గత ఏడాది తొలిసారి ఈ ఫెస్టివల్‌కు హాజరైన ఆలియా భట్‌ ఈ ఏడాది కూడా వెళ్తారని బాలీవుడ్‌ సమాచారం.

‘ఇంటర్‌నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా’ ప్రస్తుత డైరెక్టర్‌ అశుతోష్‌ గోవారీకర్, బాలీవుడ్‌ దర్శక–నిర్మాత కరణ్‌ జోహార్‌ వెళ్లనున్నారని తెలిసింది. పంజాబీ సినిమా ‘చర్దికలా’, మలయాళం సినిమా ‘బాలన్‌: ది బాయ్‌’ వంటి భారతీయ సినిమాలు ఈ చిత్రోత్సవాల్లో ప్రదర్శితం కానున్న నేపథ్యంలో ఈ సినిమా యూనిట్‌ సభ్యులు ఈ ఫెస్టివల్‌కు హాజరవుతారు.

ఇక కాన్స్‌ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శితం కానున్న తొలి పంజాబీ సినిమాగా ‘చర్దికలా’ నిలిచింది. అమ్మీ విర్క్, రూపి గిల్, హిమ్మత్‌ సంధు లీడ్‌ రోల్స్‌లో ఈ సినిమాను అమర్‌జిత్‌ సింగ్‌ సరోన్‌ దర్శకత్వంలో పింకీ ధాలివాల్‌ నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 29న థియేటర్స్‌లో రిలీజ్‌ కానుంది. అంటే... కాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శన అనంతరం ఈ సినిమా థియేటర్స్‌లో విడుదల అవుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement