
'నాకు తనంటే చాలా ఇష్టం. అందుకని తెల్లవారితే ఎంగేజ్‌మెంట్ పెట్టుకుని ఇంట్లో నుంచి పారిపోయాను...
తొలి ప్రేమ జ్ఞాపకాలు ఎప్పటికీ ప్రత్యేకమే. అలాంటి తొలి ప్రేమను తలుచుకునే అవకాశాన్ని బిగ్‌బాస్ కంటెస్టెంట్లకు కల్పించాడు. ఈ సందర్భంగా సిరి తన ఫస్ట్ లవ్ గురించి చెప్తూ ఎమోషనల్ అయింది. 'అతడి పేరు విష్ణు, ముద్దుగా చిన్నూ అంటాను. అప్పుడు నేను పదో తరగతి చదువుతున్నా. మావి ఎదురెదురు ఇల్లులు. ఒకసారి నాకు ప్రపోజ్ చేశాడు, నేను ఓకే చెప్పాను. తను చాలా పొసెసివ్, ఎలాగంటే నేను కాలేజీ ఫ్రెండ్స్‌తో మాట్లాడినా తట్టుకోలేడు. ఒకసారి మాకు పెద్ద గొడవైంది. అదే సమయంలో నాకు పెళ్లి సంబంధం వస్తే ఆ కోపంలో ఓకే చెప్పాను. రేపు ఎంగేజ్‌మెంట్ అనగా నా దగ్గరకు వచ్చి నా కాళ్లు పట్టుకుని ఏడ్చేశాడు. నాకు నువ్వు కావాలి, నువ్వు లేకుండా ఉండలేనంటూ నన్ను కన్విన్స్ చేశాడు'
'నాకు తనంటే చాలా ఇష్టం. అందుకని తెల్లవారితే ఎంగేజ్‌మెంట్ పెట్టుకుని ఇంట్లో నుంచి పారిపోయాను. అతడితో కలిసి వెళ్లిపోయాను. కానీ మా అమ్మ నాతో మాట్లాడి ఇంటికి తీసుకొచ్చింది. కొన్నాళ్లు రిలేషన్‌షిప్‌లో ఉన్నాం. ఓ రోజు ఉదయం 3 గంటలకు అలా మెలకువ వచ్చింది. మళ్లీ పడుకున్నా, తర్వాత 8 గంటలకు లేచాక తను చనిపోయాడని వార్త వచ్చింది. నాకు మెలకువ వచ్చిన సమయానికే అతడికి యాక్సిడెంట్ అయిందని తెలిసింది. తన కోసం నేను ఎంతో చేశా, కానీ దేవుడు తనను నాకివ్వలేదు. ఐ లవ్ యూ సో మచ్' అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది.