Bigg Boss 6 Telugu: బిగ్‌బాస్ కొత్త ఇల్లు అదిరిందిగా.. కంటెస్టెంట్స్ వీరే!

బుల్లితెరపై సందడి చేసేందుకు బిగ్‌బాస్ రెడీ అవుతున్నారు. తెలుగులో ఐదు సీజన్లను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఈ బిగ్ రియాల్టీ షో ఆరో సీజన్ సెప్టెంబర్ 4న ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే కంటెస్టెంట్లను క్వారంటైన్‌కి తరలించారు. ఈ సారి హౌస్‌లోకి మొత్తం 19 మంది వెళ్తున్నట్లు తెలుస్తోంది. ముందుగా 15 మంది కంటెస్టెంట్లను ఇంట్లోకి పంపనున్నారట. ఆ తర్వాత మరో నలుగురిని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా పంపించనున్నట్లు వినికిడి.
ఇప్పటికే బిగ్‌బాస్ ఆరో సీజన్‌లో పాల్గొనే కంటెస్టెంట్స్ లిస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈసారి ఫేమస్ సెలబ్రెటీలు, బుల్లితెర నటీనటులు, సింగర్స్‌తోపాటు ఓ సామాన్యుడు కూడా వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది. చలాకీ చంటి, యాంకర్ ఆరోహి, రీతూ చౌదరి, గలాట గీతూ, సింగర్ రేవంత్, అర్జున్ కళ్యాణ్, నువ్వు నాకు నచ్చావ్ సుదీప, నటుడు శ్రీహాన్, బుల్లితెర దంపతులు రోహిత్-మెరీనా అబ్రహం ఇలా ఎంతో మంది పేర్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇదిలా ఉంది ఈ సారి బిగ్‌బాస్ ఇంటిని గత సీజన్లకు భిన్నంగా, మరింత అందంగా ముస్తాబుచేశారు. తాజాగా విడుదల చేసిన ఫస్ట్ గింప్స్‌లో ఇంటిని చూపించారు. అంతేకాదు.. అందులో పాల్గొనే కంటెస్టెంట్స్ ఎంట్రీని, వారి ఫెర్ఫార్మెన్స్‌కు సంబంధించిన కొన్ని విజువల్స్‌ని చూపించారు. ఈ ఆదివారం బిగ్‌బాస్ షో గ్రాండ్‌గా ప్రారంభం కానుంది.
మరిన్ని వార్తలు