సోహైల్‌కు మ‌రో అవ‌కాశ‌మిచ్చిన నాగ్‌

Bigg Boss 4 Telugu: Nagarjuna Counters To Housemates - Sakshi

బిగ్‌బాస్ నాల్గ‌వ సీజ‌న్‌లో మొద‌టి వారం పూర్తి కావ‌స్తోంది. ఈ వారం ప్రారంభంలో అరియానా ఓవ‌రాక్ష‌న్‌, మోనాల్ ఏడుపు, క‌ల్యాణి, సూర్య కిర‌ణ్ అరుపులు, గొడ‌వ‌లే ప్ర‌ధానంగా ఉన్నాయి. త‌ర్వాత మీలోనే క‌ట్ట‌ప్ప ఉన్నాడంటూ బిగ్‌బాస్ ఇంటి స‌భ్యుల‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురి చేశాడు. ఈ క్ర‌మంలో క‌ట్ట‌ప్ప ఎవ‌రా అనేదానిపైనే మూడు రోజులుగా టాస్క్ న‌డుస్తూ వ‌స్తోంది. అయితే ఈ ఎపిసోడ్‌కు నేడు శుభం కార్డు వేస్తానంటున్నాడు కింగ్ నాగార్జున‌. అది ఎంత‌వ‌ర‌కు నిజ‌మో నేటి ఎపిసోడ్ చూస్తే కానీ న‌మ్మ‌లేం. ఇక కంటెస్టెంట్ల అంద‌రినీ న‌వ్వుతూ ప‌ల‌కరించిన నాగ్ వారు చేసిన చిలిపి ప‌నులను, త‌ప్పొప్పుల‌ను గుర్తు చేస్తూ స‌రిదిద్దే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది. (కంటెస్టెంట్ల ఎంపిక బాగోలేదు: కౌశ‌ల్‌)

"కింగ్‌తో ఇంటిస‌భ్యుల‌కు ఎన్‌కౌంట‌ర్ టైమ్ స్టార్ట్ అయిందం"టూ స్టార్ మా తాజాగా ఓ ప్రోమోను విడుద‌ల చేసింది. ఇందులో నాగ్.. సోహైల్‌కు బంపరాఫ‌ర్ ఇచ్చాడు. అరియానాను వీపు మీద కూర్చోబెట్టుకుని మ‌రోసారి పుష‌ప్స్ చేయించారు. అఖిల్‌.. నువ్వెప్పుడైనా ఇలా తీశావా? అని ప్ర‌శ్నించ‌గా త‌న‌కు అలాంటి అమ్మాయి దొర‌క‌లేద‌ని చెప్పుకొచ్చాడు. ఆ త‌ర్వాత‌ ఒక్కో కంటెస్టెంటు గురించి నాగ్ ఆరా తీయ‌డం మొద‌లుపెట్టారు. మోనాల్ ఏడుపు మీద కూడా సెటైర్ వేశారు, ద‌య‌చేసి ఇప్పుడు మ‌ళ్లీ ఏడ‌వ‌ద్ద‌ని వేడుకున్నారు. ఇక‌ దివితో అమ్మ రాజశేఖర్ పులిహోర‌ క‌ల‌ప‌డంపైనా కౌంట‌ర్లు వేశారు. మిగ‌తా ఇంటి స‌భ్యుల‌ను ఎలా ఎలా ఆట ప‌ట్టించారో? ఎవ‌రి త‌ప్పుల‌ను వేలెత్తి చూపించారో తెలుసుకోవాలంటే ఇంకొద్ది గంట‌లు ఆగాల్సిందే. (స్వయంవరానికి అర్హులు.. కానీ )

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top