Bigg Boss 15: Salman Khan and Shehnaaz Gill Gets Emotional, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Salman Khan: ఆమెను గట్టిగా హగ్‌ చేసుకొని కన్నీళ్లు పెట్టుకున్న సల్మాన్‌.. వీడియో వైరల్‌

Jan 30 2022 1:04 PM | Updated on Jan 30 2022 2:39 PM

Bigg Boss 15: Salman Khan And Shehnaaz Gill Gets Emotional, video Goes Viral - Sakshi

సల్మాన్‌ కన్నీళ్లు పెట్టుకోవడం చూసి అభిమానులు తట్టుకోలేపోతున్నారు.

సల్మాన్‌ ఖాన్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న హిందీ బిగ్‌బాస్‌ సీజన్‌ 15 చివరి దశకు చేరుకుంది. నేటితో(జనవరి 30) ఈ సీజన్‌ పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో ఫినాలే ఈవెంట్‌ని గ్రాండ్‌గా నిర్వహిస్తుంది ‘బిగ్‌బాస్’టీమ్‌. ఇందులో భాగంగా గత సీజన్స్‌లో పాల్గొన్న సెలబ్రిటీలను ఆహ్వానించారు. వారితో డాన్స్‌ ప్రోగ్రామ్‌ ఏర్పాటు చేశారు. గ్రాండ్‌గా జరుగుతున్న ఈ ఫినాలే ఈవెంట్‌లో 13వ సీజన్‌ కంటెస్టెంట్‌ షెహనాజ్‌ గిల్‌ కూడా భాగస్వామి అయింది. ఆమె బాయ్‌ప్రెండ్‌ , దివంగత నటుడు సిద్ధార్థ్‌ శుక్లాని గుర్తు చేసుకుంటూ.. డాన్స్‌ ఫెర్పార్మన్స్‌తో స్టేజ్‌పైకి ఎంట్రీ ఇచ్చింది షెహనాజ్‌.

అక్కడ హోస్ట్‌ సల్మాన్‌ను చూసి ఎమోషనల్‌ అయింది. దీంతో సల్లూ భాయ్‌ వెంటనే ఆమెను హగ్‌ చేసుకొని ఓదార్చే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత సిద్ధార్థ్ ను గుర్తుచేసుకుంటూ సల్మాన్ కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. దీనికి సబంధించిన ప్రోమో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. కాగా, బిగ్‌బాస్‌ హౌస్‌లో ప్రస్తుతం తేజస్వి ప్రకాష్, కరణ్ కుంద్రా, ప్రతీక్ సెహజ్‌పాల్ మరియు షమితా శెట్టి ఉన్నారు. వీరిలో విజేత ఎవరనేది మరికొన్ని గంటల్లో తేలనుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement