The Archies First Look: బాలీవుడ్ బిగ్ స్టార్స్ వారసులంతా ఒకే ఫ్రేమ్‌లో..

బాలీవుడ్ బిగ్ ఫ్యామిలీస్ వారసులు అగస్త్యా నంద (అమితాబ్ బచ్చన్ మనవడు), ఖుషీ కపూర్ (బోనీ కపూర్ – దివంగత నటి శ్రీదేవిల చిన్న కుమార్తె), సుహానా ఖాన్ (షారుక్ ఖాన్ కుమార్తె) నటిస్తున్న తొలి వెబ్ ఫిల్మ్ ‘ద ఆర్చీస్’ పోస్టర్ విడుదలైంది.
జోయా అక్తర్ దర్శకత్వం వహిస్తున్న ఈ వెబ్ మూవీలో మిహిర్ అహుజా, డాట్, యువరాజ్ మెండా కూడా నటిస్తున్నారు. శనివారం ‘ద ఆర్చీస్’ గ్యాంగ్ ఇదే అని ప్రకటించి, ఫొటోని రిలీజ్ చేశారు. 2023లో నెట్‌ఫ్లిక్స్‌లో ఈ వెబ్ ఫిల్మ్ స్ట్రీమింగ్ కానుంది.
The sun is out, the news is out! Come meet your new friends.
Presenting to you the cast of The Archies, directed by the fantastic Zoya Akhtar. pic.twitter.com/vOtm29V0gP— Netflix India (@NetflixIndia) May 14, 2022