Allu Arjun Pushpa First Movie Review By Umair Sandhu From UAE - Sakshi
Sakshi News home page

Pushpa First Review: పుష్ప ఫస్ట్‌ రివ్యూ.. బొమ్మ దద్దరిల్లిపోయింది!

Dec 15 2021 8:19 PM | Updated on Dec 20 2021 11:44 AM

Allu Arjun Pushpa Movie First Review From UAE - Sakshi

Pushpa Movie First Review: పుష్ప ప్రభంజనం మొదలు కావడానికి ఇంకా రెండు రోజులు మాత్రమే ఉంది. డిసెంబర్‌ 17న ఏడు భాషల్లో రిలీజ్‌ అవుతున్న పుష్ప గురించి సినీప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో పుష్ప సినిమా ఫస్ట్‌ రివ్యూ వచ్చింది. ప్రముఖ సినీ విశ్లేషకుడు ఉమైర్‌ సంధు ఈ సినిమాపై రివ్యూ ఇచ్చారు.

యూఏఈ సెన్సార్‌ బోర్డు సభ్యుడైన ఇతడు పుష్ప చిత్రం ఫస్ట్‌ హాఫ్‌ చూసి చాలా అద్భుతంగా ఉందని చెప్పుకొచ్చారు. సినిమా మొత్తం చూశాక 'పుష్ప' ఈ ఏడాదిలోనే ఉత్తమ టాలీవుడ్‌ చిత్రంగా నిలుస్తుందని జోస్యం పలికారు. ఈ సినిమా అల్లు అర్జున్‌ కెరీర్‌ను మలుపు తిప్పుందనడంలో అతిశయోక్తి లేదన్నారు. బన్నీని సరికొత్త అవతారంలో చూసి ఆయన ఫ్యాన్స్‌కు పూనకాలు రావడం ఖాయమని పేర్కొన్నారు. రష్మిక అద్భుతంగా నటించిందన్న ఉమైర్‌ హీరోహీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ కూడా బాగా పండిందని తెలిపారు. కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌, సుకుమార్‌ దర్శకత్వం ఓ రేంజ్‌లో ఉందని ప్రశంసలు కురిపించారు.

ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో తెరెక్కనున్న పుష్ప సినిమాలో బన్నీ పుష్పరాజ్‌గా కనిపించనున్న విషయం తెలిసిందే. రష్మిక మందన్నా పల్లెటూరి యువతి పాత్రలో ఆకట్టుకోనుంది. స్టార్‌ హీరోయిన్‌ సమంత స్పెషల్‌ సాంగ్‌లో స్టెప్పులేసింది. ఈ మధ్యే రిలీజైన ఈ సాంగ్‌ యూట్యూబ్‌లో తెగ ట్రెండ్‌ అవుతోంది!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement