
వైజాగ్ పోర్టులో అదిరిపోయే డ్యాన్స్ మూమెంట్స్ చేస్తున్నారు అల్లు అర్జున్. ‘పుష్ప’ చిత్రంలోని తొలి భాగం ‘పుష్ప: ది రైజ్’ సక్సెస్ తర్వాత మలి భాగం ‘పుష్ప: ది రూల్’తో బిజీగా ఉన్నారు ఈ చిత్రం హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ వైజాగ్‌లోని పోర్టు లొకేషన్స్‌లో జరుగుతోంది. అల్లు అర్జున్ పై ఓ పాట చిత్రీకరిస్తున్నట్లుగా తెలిసింది.
ఇది హీరో ఇంట్రడక్షన్ సాంగ్ అట. ఈ చిత్రంలో పుష్పరాజ్ పాత్రలో నటిస్తున్నారు అల్లు అర్జున్. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ఆరంభంలో రిలీజ్ కానున్నట్లు తెలిసింది. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్.