ప్రతీకారానికి అందమైన రూపం.. ఐశ్వర్య రాయ్ లుక్‌ | Aishwarya Rai First Look Poster From Ponniyin Selvan | Sakshi
Sakshi News home page

Aishwarya Rai : పళవూరు రాణిగా ఐశ్వర రాయ్.. ఆకట్టుకుంటున్న పోస్టర్‌

Jul 6 2022 8:04 PM | Updated on Jul 6 2022 8:15 PM

Aishwarya Rai First Look Poster From Ponniyin Selvan - Sakshi

ప్రముఖ దర్శకుడు మణిరత్నం డ్రీమ్​ ప్రాజెక్ట్​ చిత్రం 'పొన్నియన్​ సెల్వన్: పార్ట్‌ 1'. మద్రాస్​ టాకీస్​తో కలిసి లైకా ప్రొడక్షన్స్​ భారీ బడ్జెట్​తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో విక్రమ్​, జయం రవి, కార్తీ, ఐశ్వర్య రాయ్, త్రిష ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

Aishwarya Rai Ponniyin Selvan First Look Poster: ప్రముఖ దర్శకుడు మణిరత్నం డ్రీమ్​ ప్రాజెక్ట్​ చిత్రం 'పొన్నియన్​ సెల్వన్: పార్ట్‌ 1'. మద్రాస్​ టాకీస్​తో కలిసి లైకా ప్రొడక్షన్స్​ భారీ బడ్జెట్​తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో విక్రమ్​, జయం రవి, కార్తీ, ఐశ్వర్య రాయ్, త్రిష ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. 1955లో కల్కి కృష్ణమూర్తి రచించిన నవల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడా మణిరత్నం. భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ చిత్రం సెప్టెంబర్ 30న విడుదల చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఈ సినిమాలోని నటీనటుల ఫస్ట్‌ లుక్‌ పోస్టర్లను విడుదల చేస్తున్నారు. 

ఇప్పటికే విడుదలైన విక్రమ్‌, కార్తీ పోస్టర్లు సినిమాపై అంచనాలను  పెంచేలా ఉన్నాయి. తాజాగా ఐశ్వర్య రాయ్‌ ఫస్ట్ లుక్‌ను బుధవారం (జులై 6) రివీల్ చేసింది చిత్రబృందం. 'ప్రతీకారానికి అందమైన రూపం. నందిని.. పళవూరు రాణి' అంటూ సోషల్‌ మీడియా వేదికగా ఐశ్వర్య రాయ్‌ క్యారెక్టర్‌ను ప్రకటించారు. ఇందులో మనోహరమైన రూపంతో పగ, ప్రతీకారం కోసం ఎదురుచూస్తున్న పళవూరు రాణి నందినిగా ఐశ్వర్య రాయ్ పోస్టర్‌ ఉంది. ఈ పోస్టర్‌లో ఐశ్వర్య రాయ్‌ లుక్ అదిరిపోయింది. ప్రస్తుతం ఈ పోస్టర్‌ నెట్టింట వైరల్‌గా మారింది. 

చదవండి: ప్రపంచంలోనే ఖరీదైన వజ్రం తమన్నా సొంతం.. కోట్లలో ఆస్తులు..
ఏ దేశపు మహారాణి.. గొడుగు కొనుక్కోడానికి డబ్బులు లేవా ?

Advertisement
 
Advertisement
Advertisement