లక్సెట్టిపేట: ప్రేమ విఫలమైన ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మండలంలో తిమ్మాపూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్సై గోపతి సురేష్ కథనం ప్రకారం..తిమ్మాపూర్ గ్రామానికి చెందిన బైరి రాజ్‌కుమార్ (26) మార్బుల్ పని చేసేవాడు. సమీపంలోని ఓ గ్రామానికి చెందిన యువతితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. నాలుగేళ్లుగా ప్రేమించుకున్నారు. మనస్పర్థల కారణంగా ఏడాది క్రితం విడిపోయారు. అప్పటినుంచి మనస్తాపం చెందాడు. శుక్రవారం రాత్రి ఇంటి డాబాపై పురుగుల మందు తాగాడు. శనివారం ఉదయం కుటుంబసభ్యులు గమనించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం మంచిర్యాలకు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. తండ్రి కాంతయ్య ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.


