● నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం ● యోగాపై పెరుగుతున్న ఆసక్తి ● నిత్యజీవితంలో భాగం ● వ్యాయామాలకు మేలు | - | Sakshi
Sakshi News home page

● నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం ● యోగాపై పెరుగుతున్న ఆసక్తి ● నిత్యజీవితంలో భాగం ● వ్యాయామాలకు మేలు

Jun 21 2026 12:55 AM | Updated on Jun 21 2026 12:55 AM

● నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం ● యోగాపై పెరుగుతున్న ఆసక్తి ● నిత్యజీవితంలో భాగం ● వ్యాయామాలకు మేలు ●

ఒంటికి యోగా మంచిదే..

‘యోగా’గురువు..

మంచిర్యాలటౌన్‌: మంచిర్యాలకు చెందిన మండ శ్రీనివాస్‌ యోగా గురువుగా పిలుస్తుంటారు. గుడిపేట్‌ 13వ బెటాలియన్‌లో శిక్షణ పొందుతున్న పోలీసులకు యోగా నేర్పిస్తున్నారు. జిల్లా యోగా అసోసియేషన్‌ సెక్రటరీగా ఉంటూనే, వెయ్యికి పైగా విద్యార్థులను జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయికి వెళ్లేలా వారికి శిక్షణ ఇచ్చి తీర్చిదిద్దారు. యోగా శిక్షణ ఇస్తూ ఉపాధి పొందుతూ, శిక్షకులు, జడ్జిలను తయారు చేస్తున్నారు. పతకాలు రాణించేలా తీర్చిదిద్ది ఆదర్శంగా నిలుస్తున్నారు.

మండ శ్రీనివాస్‌,

జిల్లా యోగా అసోసియేషన్‌ సెక్రటరీ

చిన్ననాటి నుంచే రాణిస్తూ

చిన్ననాటి నుంచి యోగాలో రాణిస్తున్నా. స్కూల్‌ ఫెడరేషన్‌ గేమ్స్‌లో రాష్ట్రస్థాయిలో పతకాలు సాధించా. ఈ ఏడాది జనవరిలో కామారెడ్డి యోగా భవన్‌లో రాష్ట్రస్థాయి పోటీల్లో అండర్‌–18 విభాగంలో బంగారు పతకాలు సాధించి సౌజ్‌ జోన్‌ పోటీలకు ఎంపికయ్యా. అక్కడ రాణించకపోయినా, యోగాలో శిక్షణ పొందుతున్నా.

– చైత్ర, రామకృష్ణాపూర్‌

పీడీ ప్రోత్సాహంతో..

దండేపల్లి: నేను దండేపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నా. పీడీ రవి ప్రోత్సాహంతో రెండేళ్లుగా యోగాలో రాణిస్తున్నా. పలు పోటీల్లో బహుమతులు గెలుచుకున్నా. సీఎంకప్‌, మండల, జిల్లా, జోనల్‌ పోటీల్లో పాల్గొన్నా. హెచ్‌ఎం రాజేశ్వర్‌రావు, ఉపాధ్యాయులు అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీల్లో బహుమతి సాధించడమే తన లక్ష్యం.

– యోగా ఆసనం వేస్తున్న విజయ్‌

ఆసక్తితో శిక్షణ

మా తల్లిదండ్రులు అనురాధ, మోహన్‌ ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులు. తనకు యోగాపై ఉన్న ఆసక్తితో శిక్షణ ఇప్పించారు. ఈ ఏడాది జనవరిలో కామారెడ్డి యోగా భవన్‌లో రాష్ట్రస్థాయి పోటీల్లో బంగారు పతకం సాధించి సౌత్‌జోన్‌కు ఎంపికయ్యా. అక్కడా బ్రాంజ్‌ మెడల్‌ సొంతం చేసుకున్నా. ప్రస్తుతం హైదరాబాద్‌లో యోగా శిక్షణ ఇస్తున్నా. – సి. వైష్ణవి, మంచిర్యాల

శిక్షకుడిగా పనిచేస్తున్నా

నిర్మల్‌ఖిల్లా: 2018లో ఎంటెక్‌ పూర్తి చేశాక.. యోగాపై ఆసక్తి పెరిగింది. గురువు అన్నపూర్ణ వద్ద యోగాసనాల సాధన చేశా. యోగా తో ఆరోగ్య ప్రయోజనాలు నలుగురికి చెప్పాలన్న తపనతో అన్ని మెలకువలు నేర్చుకుని శిక్షకుడి అయ్యాను. యోగాలో లెవెల్‌–3 శిక్షణ పూర్తిచేసి కేంద్ర ప్రభుత్వం ఆయుష్‌ శాఖలో కాంట్రాక్ట్‌ శిక్షకుడిగా పనిచేస్తున్నా. – ఎం.ప్రదీప్‌,

యోగా శిక్షకుడు, ఆయుష్‌శాఖ, నిర్మల్‌

‘యోగాతో సంపూర్ణ ఆరోగ్యం’

మంచిర్యాలటౌన్‌: యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని కిడ్జీ స్కూల్‌ చైర్మన్‌ దామెర సిద్దయ్య అన్నారు. జిల్లా కేంద్రం లక్ష్మీనగర్‌ స్కూల్‌లో శనివారం విద్యార్థులు, తల్లిదండ్రులతో కలసి ఫాదర్స్‌ డే, యోగా డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు తండ్రి గొప్పతనాన్ని తెలిసేలా నృత్యాలు పాటలతో అలరించారు. అనంతరం యోగా మాస్టర్‌ ఎం.శంకర్‌ అభ్యాసకులతో ఆసనాలు వేయించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ ఉమారాణి, టీచర్లు ,సిబ్బంది పాల్గొన్నారు.

పట్టుదలతో సాధన చేస్తూ..

ఆదిలాబాద్‌: జిల్లా కేంద్రంలోని సంజయ్‌నగర్‌కు చెందిన చౌహాన్‌ ప్రజ్యోత్‌సింగ్‌ యోగాలో పట్టుదలతో సాధన చేస్తూ జాతీయ స్థాయి సత్తాచాటుతున్నాడు. యోగాలో ఎం.ఏ చదువుతున్న ఈయన చిన్నప్పటి నుంచే యోగాపై ఆసక్తి ఉండేది. ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆరు సార్లు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నాడు. హర్యానాలో బంగారు పతకం సాధించాడు. రాష్ట్ర స్థాయిలో 11 మీట్లలో పాల్గొని 16 స్వర్ణం, 8 రజతం, 4 కాంస్య పతకాలు కై వసం చేసుకున్నాడు. తల్లిదండ్రులు ఉదయ్‌ సింగ్‌, శారద ప్రోత్సాహం, గురువులు చేతన్‌, తిరుపతి రెడ్డిల శిక్షణే తన విజయాలకు కారణమని తెలిపాడు. భవిష్యత్తులో యోగా ప్రొఫెసర్‌గా స్థిరపడి, సొంతంగా యోగా స్టూడియోను ఏర్పాటు చేయాలన్నది లక్ష్యమంటున్నాడు.

పతకాలు తన ఖాతాలోకి..

ఆదిలాబాద్‌: తలమడుగు మండలం అర్లి(కె) గ్రామానికి చెందిన బొండ్ల భార్గవ్‌ యోగాలో సత్తాచాటుతున్నాడు. ప్రస్తుతం ఫిజియోథెరపీ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్న ఈయన పదేళ్లుగా యోగాలో రాణిస్తున్నాడు. ఇప్పటివరకు 8 జాతీయ, 10 రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని ప్రతిభ చాటుకున్నాడు. 7 స్వర్ణ, 3 రజత, 4 కాంస్యంతో కలిపి 14 పతకాలను తన ఖాతాలో వేసుకున్నాడు. తండ్రి ఆర్‌ఎస్‌ఎస్‌లో యోగా చేయడం చూసి స్ఫూర్తి పొందిన భార్గవ్‌, కోచ్‌ సంతోష్‌ శిక్షణ, తల్లిదండ్రులు, అన్న మద్దతు తన విజయాలకు కారణమని చెబుతాడు. భవిష్యత్తులో వరల్డ్‌ ఛాంపియన్‌ అథ్లెట్‌గా ఎదగాలని, అదే సమయంలో ఒక మంచి ఫిజియోథెరపిస్ట్‌గా సేవలందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.

ప్రపంచానికిచ్చిన గొప్ప కానుక

భారతదేశం ప్రపంచానికిచ్చిన గొప్ప కానుక యోగా. ప్రపంచ దేశాలు ఆమోదించాయి. నేటి కాలంలో అనేక మానసిక, శారీరక రుగ్మతలకు గొప్ప విరుగుడు. రోజూ ఒక గంట చేస్తే, ప్రతీ ఒక్కరి జీవితంలో అద్భుతాలు జరుగుతాయి.

– ముల్కల శంకర్‌, యోగా గురువు, మంచిర్యాల

మెలకువలు నేర్చుకుని

కుంటాల: కుంటాలకు చెందిన చిన్నారులు మోక్ష, షర్ణిక.. యోగాలో సత్తాచా టుతున్నారు. గత రెండేళ్లుగా యోగా శిక్షణలో మెలకువలు నేర్చుకుని జిల్లా, రాష్ట్రస్థాయిలో రాణిస్తున్నారు. వారిని పలువురు అభినందిస్తున్నారు.

షర్ణిక

మోక్ష

సులువుగా ఆసనాలు వేస్తున్నా

నాకు మైగ్రేన్‌, వెన్నునొప్పి ఉండేది. యోగా మొదలుపెట్టా. క్రమంగా తగ్గిపోయి, ఉత్సాహంగా మొదట ఆసనాలు కష్టమనిపించినా ఇప్పుడు సులువుగా వేస్తున్నా.

– కె.నీరజ, లక్ష్మీనగర్‌, మంచిర్యాల

ఒత్తిడి దూరం

రోజువారీ యోగాతో ఒత్తిడి దూరమవుతోంది. మానసిక ప్రశాంత చేకూరి, ఆరోగ్యంగా ఉండేందుకు యోగా చక్కని ఔషధం.

– పి.హన్మంతరావు,

డీఏవో, బెల్లంపల్లి సబ్‌ కలెక్టర్‌ ఆఫీసు

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఒత్తిడిని దూరం చేసి, మనస్సును ఏకం చేసి శరీరాన్ని అదుపులో పెట్టేందుకు పలువురు

యోగా బాట పడుతున్నారు. ఒంటికి యోగా మంచిదేనని పేర్కొంటున్నారు.

ప్రతీ రోజూ చేస్తా

ప్రతీ రోజూ యోగా చేస్తాను. వయస్సురీత్యా వచ్చే రుగ్మతలతోపాటు, మానసిక ప్ర శా ంతతను కూడా అందిస్తోంది.

– గజ్జెల్లి వెంకటయ్య,

విశ్రాంత సింగరేణి కార్మికుడు, మంచిర్యాల

ఇంట్లో అందరం చేస్తాం

మా ఇంట్లో అందరం యోగా చేస్తాం. మెరుగైన జీవనం ప్రతిఒక్క రూ అలవాటు చేసుకో వాలి.– కుమార స్వామి,

ల్యాబ్‌ టెక్నీషియన్‌, మంచిర్యాల

ముందే ప్రారంభించాలి

ప్రతీ ఒక్కరూ యోగా చేయాలి. వ్యాధులు వచ్చాక చేయడం కన్నా, ముందు నుంచే ప్రారంభిస్తే ఎన్నో ప్రయోజనాలుంటాయి.

– వొడ్నాల శ్రీనివాస్‌,

వ్యాపారి, మంచిర్యాల

పోటీ ప్రపంచంలో జీవనం ఉరుకులు, పరుగులమయమైంది. మానసిక, వ్యక్తిగత ఒత్తిళ్లతో అనారోగ్యం బారినపడుతున్నారు. ఇందుకు ఉపశమనం పొందేలా యోగాసనాలు చేస్తున్నారు. అన్నివర్గాల్లో ఆసక్తి పెరగడం, నిత్యజీవితంలో మానసిక ప్రశాంతత, వ్యాయామ సాధనకు యోగాసనాలు ఓ భాగమైంది. నేడు అంతర్జాతీయ యోగాదినోత్సవం సందర్భంగా కథనం.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement