
అక్కడి ధాన్యం ఇక్కడ విక్రయం!
చెన్నూర్‌రూరల్: మండలంలోని కత్తెరసాల పంచాయతీ పరిధిలోని సుబ్బరాంపల్లి గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఇతర ప్రాంతా ల నుంచి తీసుకు వచ్చిన ధాన్యం విక్రయిస్తున్నారని స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. కోట పల్లి మండలంతోపాటు మహారాష్ట్ర నుంచి కూడా ధాన్యం తీసుకువచ్చి స్థానిక రైతులపేరి ట విక్రయిస్తున్నారని పేర్కొంటున్నారు. దీంతో స్థానికంగా కొనుగోళ్లు ఆలస్యమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం రాత్రి ఇత ర ప్రాంతాల నుంచి తీసుకు వచ్చిన ధాన్యం లారీలో లోడ్ చేస్తున్న సమయంలో రైతులు అడ్డుకున్నారు. పోలీసులు, వ్యవసాయశాఖకు సమాచారం అందించారు. చెన్నూర్ సీఐ దేవేంవర్ లారీని చెన్నూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. చెన్నూర్ పట్టణానికి ఒక ఉపాధ్యాయు డు సుబ్బరాంపల్లిలో తనకున్న భూమి లో పండించిన ధాన్యంతోపాటు కోటపల్లి మండలం జనగామ గ్రామం నుంచి ధాన్యం బస్తాలు తీసుకువచ్చి ఇక్కడ అమ్ముతున్నాడని తెలిపా రు. వాటిని కొనుగోలు చేసిన కేంద్రం నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక రైతుల ధాన్యం ఉండగా ఇతర ధాన్యం ఎలా కొనుగోలు చేస్తారని నిలదీశారు. స్థానిక రైతుల పేరిటే ధాన్యం కొనుగోలు చేసినట్లు నిర్వాహకులు తెలుపడంతో లారీని వదిలిపెట్టారు.