
పాలిసెట్‌కు సర్వం సిద్ధం
● రేపే ప్రవేశ పరీక్ష ● ఉమ్మడి జిల్లాలో 28 పరీక్ష కేంద్రాలు ● హాజరుకానున్న 8195 మంది విద్యార్థులు
ప్రశాంతంగా పరీక్ష రాయాలి
విద్యార్థులు ఎలాంటి భయాందోళనకు గురికావొద్దు. పరీక్ష కేంద్రంలో చేతికి ప్రశ్నాపత్రం అందజేసిన తర్వాత ముందస్తుగా సూచనలు చదివి అనుసరించాలి. ప్రశాంత వాతావరణంలో పరీక్ష రాయాలి. చదివిన అంశాలను గుర్తు చేసుకుని జవాబులు రాస్తే పరీక్షలో నెగ్గడానికి వీలుంటుంది.
– డాక్టర్ ఎం.దేవేందర్,
మంచిర్యాల జిల్లా కోఆర్డినేటర్
బెల్లంపల్లి: రాష్ట్రంలో ఉన్న సాంకేతికవిద్య కళాశాలల్లో మూడేళ్ల డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు ఈనెల 13న పాలిసెట్–2025 పరీక్షకు సర్వం సిద్ధమైంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉమ్మ డి జిల్లాలోని ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, వాంకిడి, మంచిర్యాల, బెల్లంపల్లిలో మొత్తం 28 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో 8,195 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ప్రవేశ పరీక్షక్ష ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు జరగనుంది. విద్యార్థులు గంట ముందుగానే పరీక్ష ఆయా కేంద్రాల్లోకి చేరుకోవాలి. పరీక్ష ప్రారంభమైన ఒక్కనిమిషం ఆలస్యమైన కేంద్రంలోకి అనుమతించరు. పరీక్ష సమయానికి ముందస్తుగానే కాలకృత్యాలు తీర్చుకుని రావల్సి ఉంటుంది. మధ్యలో వెళ్లే పరిస్థితి లేదు.
విద్యార్థులు పాటించాల్సిన సూచనలు..
● పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు హాల్‌టికెట్, ప్యాడ్, హెచ్‌బీ పెన్సిల్, షార్పనర్, ఎరేజర్, నీలం లేదా నలుపు బాల్ పాయింట్ పెన్ తెచ్చుకోవాలి.
● రఫ్ వర్క్ కోసం ప్రశ్నాపత్రంలో చివర రెండు ఖాళీపేజీలు అందుబాటులో ఉంటాయి. బయటి నుంచి కాగితాలు తీసుకురా వొద్దు.
● హాల్‌టికెట్‌పై ఫొటోలేని విద్యార్థులు గెజిటెడ్ అధికారి ధ్రువీకరణపత్రంతో పరీక్షకు హాజరుకావాలి.
● సెల్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, వాచీలు, తదితర తీసుకురావడానికి అనుమతి లేదు.
ఉమ్మడి జిల్లాలో..
జిల్లా విద్యార్థులసంఖ్య పరీక్ష కేంద్రాలు
ఆదిలాబాద్ 1,102 03
నిర్మల్ 2,422 08
కుమురం భీం ఆసిఫాబాద్ 1,032 04
(వాంకిడి సెంటర్‌కలుపుకుని)
మంచిర్యాల 2,558 10
బెల్లంపల్లి 1,081 03

పాలిసెట్‌కు సర్వం సిద్ధం