ట్యాంకర్‌ డ్రైవర్‌కు 14 రోజుల జైలుశిక్ష | - | Sakshi
Sakshi News home page

ట్యాంకర్‌ డ్రైవర్‌కు 14 రోజుల జైలుశిక్ష

Jun 19 2026 12:48 AM | Updated on Jun 19 2026 12:48 AM

అడ్డాకుల: మద్యం మత్తులో వాహనాన్ని నడిపి ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌కు కోర్టు జైలు శిక్ష, జరిమానా విధించింది. మూసాపేట ఎస్‌ఐ ఎం.వేణు వివరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం తూముకూరు జిల్లా గర్రాని గ్రామానికి చెందిన జీవీ.శివకుమార్‌ (29) గాయత్రి డెయిరీకి చెందిన మిల్క్‌ ట్యాంకర్‌ను నడుపున్నాడు. బుధవారం కర్ణాటకలోని బల్లూర్‌ నుంచి మిల్క్‌ ట్యాంకర్‌ను హైదరాబాద్‌కు తీసుకెళ్తుండగా మూసాపేట మండలం కొమిరెడ్డిపల్లి శివారులో జాతీయ రహదారిపై వాహనం బోల్తా పడింది. అదృష్టవశాత్తు ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. డ్రైవర్‌ శివకుమార్‌ మద్యం మత్తులో వాహనాన్ని నడిపినట్లు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ పరీక్షలో తేలడంతో కేసు నమోదు చేసి గురువారం జిల్లా కేంద్రంలోని కోర్టులో హాజరు పరిచారు. న్యాయమూర్తి నిందితుడికి 14 రోజుల జైలు శిక్ష, రూ.3వేల జరిమానా విధించారు.

ఆరు నెలలు జైలు శిక్ష

కొల్లాపూర్‌ రూరల్‌: భూతగాదాల ఘర్షణలో ముగ్గురు దోషుల కు ఆరు నెలలు జైలు శిక్ష రూ.18వేలు జరిమానా విధిస్తూ గురువారం కొల్లాపూర్‌ అడిషనల్‌ జ్యూడిషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ నాయమూర్తి ఆర్‌ శరణ్య తీర్పు వెలువరించారని ఎస్పీ సంగ్రామ్‌ సింగ్‌ పాటిల్‌ తెలిపారు. నిందితులకు శిక్ష పడేలా కృషి చేసిన పెంట్లవెల్లి ఎస్‌ఐ పవన్‌కుమార్‌, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ శిరిష, కోర్టు మానిటరింగ్‌ ఎస్‌ఐ అభిషేక్‌ రెడ్డి, కోర్డు కానిస్టేబుల్‌ హనుమంతును ఎస్పీ అభినందించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement