బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో పంట దిగుబడులు విక్రయించేందుకు వచ్చిన రైతులకు కనీస మౌలిక సౌకర్యాలు కల్పించాలి. రైతులకు తాగునీరు, మరుగుదొడ్లు ఇతర వసతులతోపాటు విశ్రాంతి గది నిర్మించాలి. రాత్రివేళలో విశ్రాంతి గదిలో వసతి ఉండేలా చర్యలు తీసుకోవాలి. – పాండునాయక్,
రైతు, యాసాయికుంటతండా
రక్షణ చర్యలు చేపట్టాలి..
బాదేపల్లి మార్కెట్ యార్డులో పంట దిగుబడులు విక్రయించే సమయంలో ధాన్యం ఇతర పంట ఉత్పత్తులకు రక్షణ లేకుండా పోతుంది. వర్షం వచ్చినప్పుడు ఆరుబయట పోసిన పంట తడిసిపోయి నష్టం వాటిల్లుతోంది. యార్డులో అదనంగా షెడ్లు నిర్మించాలి. అలాగే రైతులకు భోజన వసతి ఏర్పాటు చేయాలి.
– శ్రీనివాస్‌రెడ్డి, రైతు, మిడ్జిల్
ప్రభుత్వానికి నివేదించాం..
జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ యార్డుల నిర్వహణకు సంబంధించిన అనేక బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. బాదేపల్లితోపాటు ఇతర మార్కెట్ యార్డులకు సంబంధించి బిల్లుల చెల్లింపులకు సుమారు రూ.5 కోట్లు విడుదల చేస్తే చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతాయి. దీనిపై ఇప్పటికే బిల్లులను ప్రభుత్వానికి నివేదించాం. ప్రభుత్వం నిధులు విడుదల చేసిన వెంటనే ఆయా పనులు చేపడుతాం.
– బాలామణి, జిల్లా మార్కెటింగ్ అధికారి
●


