పల్లెగడ్డ పిల్లలంతా.. ప్రభుత్వ బడికే | - | Sakshi
Sakshi News home page

పల్లెగడ్డ పిల్లలంతా.. ప్రభుత్వ బడికే

Jun 18 2026 12:59 AM | Updated on Jun 18 2026 12:59 AM

నవాబుపేట మండలంలోని పల్లెగడ్డ గ్రామానికి చెందిన 64 మంది విద్యార్థులు ఒకేసారి ప్రభుత్వ పాఠశాలలో చేరి ఆదర్శంగా నిలిచారు. గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఉండగా కేవలం 24 మంది మాత్రమే చదివేవారు. మిగతా 71 మంది ప్రైవేట్‌ పాఠశాలలకు వెళ్లేవారు. దీంతో అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని తల్లిదండ్రులను ఒప్పించడంతో బుధవారం 64 మంది విద్యార్థులు ఒకేసారి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చేరారు. మిగతా వారిని సైతం ఇక్కడే చేర్పించి ప్రైవేట్‌ వద్దు.. ప్రభుత్వ పాఠశాల ముద్దు అనే నినాదాన్ని చాటిచెబుతామని పల్లెగడ్డ గ్రామస్తులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ జయరాంనాయక్‌, ఎంఈఓ నాగ్యనాయక్‌, సర్పంచ్‌ బాలరాజు తదితరులు పాల్గొన్నారు. – నవాబుపేట

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement