ఎస్‌ఐఆర్‌పై అవగాహనకు 2కే రన్‌ | - | Sakshi
Sakshi News home page

ఎస్‌ఐఆర్‌పై అవగాహనకు 2కే రన్‌

Jun 18 2026 12:59 AM | Updated on Jun 18 2026 12:59 AM

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు గాను బుధవారం జిల్లా ప్రధాన స్టేడియం మైదానంలో 2కే రన్‌ను రెవెన్యూ అడిషనల్‌ కలెక్టర్‌ జేఎల్‌బీ హరిప్రియతో కలిసి స్థానిక సంస్థల అడిషనల్‌ కలెక్టర్‌ మధుసూదన్‌నాయక్‌ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపడుతున్న ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆర్‌డీఓ నవీన్‌, అర్బన్‌ మండల తహసీల్దార్‌ ఘాన్సీరాం, డీటీ దేవేందర్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement